ETV Bharat / international

'తబ్లిగీ జమాత్​తో సమాజానికి ముప్పు'- సౌదీలో నిషేధం - tablighi jamaat news

Saudi Tablighi Jamaat: తబ్లిగీ జమాత్​తో ప్రజలకు, సమాజానికి పెను ముప్పు పొంచి ఉందని సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు దేశంలో ఈ ఇస్లామిక్​ సంస్థపై నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేసింది.

Saudi Arabia bans Tablighi Jamaat,
Saudi Arabia bans Tablighi Jamaat,
author img

By

Published : Dec 12, 2021, 10:05 AM IST

Saudi Tablighi Jamaat: ఇస్లామిక్​ సంస్థ.. తబ్లిగీ జమాత్​ను సౌదీ అరేబియా నిషేధించింది. దీనితో సమాజానికి ప్రమాదమని తేల్చిచెప్పింది.

ప్రపంచ దేశాలకు ముప్పుగా పరిణమిస్తున్న ఉగ్రవాదానికి.. తబ్లిగీ ఒక మార్గమని ఆ సంస్థను ఉద్దేశించి వ్యాఖ్యానించింది సౌదీ ప్రభుత్వం. ఈ మేరకు ఇస్లామిక్​ వ్యవహారాల మంత్రి డా. అబ్దుల్​లతీఫ్​ అల్​ షేక్​ ఓ ప్రకటన చేశారు.

తబ్లిగీ జమాత్​తో సమాజానికి ముప్పు పొంచి ఉందని ప్రజలకు తెలియజేయాలని మసీదులకు ఆదేశించింది సౌదీ ప్రభుత్వం. ఆ సంస్థ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది.

తబ్లిగీ జమాత్​ పని.. ముస్లింలను ప్రోత్సహించడం, సున్నీ ఇస్లాంను అనుసరించాలని ఇతరులకు ఉద్బోధ చేయడం.

94 సంవత్సరాల క్రితం 1926లో మౌలానా మహ్మద్​ ఇలియాస్​.. తబ్లిగీ జమాత్​ను ప్రారంభించారు. ఇస్లాంలు.. దీనిని మత సంస్కరణల ఉద్యమంగా వ్యాప్తి చేశారు.

ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని దీనిపై పలుమార్లు ఆరోపణలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 35-30 కోట్ల మంది ముస్లింలు.. తబ్లిగీని అనుసరిస్తున్నట్లు సమాచారం. 100 దేశాలకుపైగా తబ్లిగీ ఉనికి ఉంది. ఇండోనేసియా, మలేసియా, పాకిస్థాన్​, బంగ్లాదేశ్​, థాయిలాండ్​ వంటి దేశాల్లో తబ్లిగీలు కోట్లల్లో ఉన్నారు.

భారత్​లో వారిపై నిషేధం..

Tablighi Jamaat News: 2020 మార్చిలో భారత్​లో కరోనా వ్యాప్తికి తబ్లిగీ జమాతే ప్రధాన కారణమని కేంద్రం అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా ఆంక్షలు​ ఉన్న సమయంలో నిజాముద్దీన్​లో జరిగిన తబ్లిగీ జమాత్ మతపరమైన కార్యక్రమానికి వేలాదిగా హాజరయ్యారని పేర్కొంది. వీరిలో చాలా మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఆ తర్వాత దేశంలో కరోనా వేగంగా విస్తరించింది.

Tablighi Jamaat Banned in India: ఈ కార్యకలాపాల్లో పాల్గొన్న 2500 మందికిపైగా విదేశీయులను భారత్​లో ప్రవేశించకుండా పదేళ్ల నిషేధం విధించింది.

ఇవీ చూడండి: బ్లిగీ జమాతే​ విదేశీయులపై పదేళ్ల పాటు నిషేధం

'దిల్లీకి వెళ్లొచ్చిన వారిని దేశ ద్రోహులుగా చూస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.