ETV Bharat / international

యుద్ధం కోసం చైనా ప్రాక్టీస్​- ఏకంగా అమెరికా నౌకలతో..!

author img

By

Published : Nov 8, 2021, 3:07 PM IST

యూఎస్ యుద్ధ నౌకల నమూనాలను చైనా తయారు చేసి వాటిని యుద్ధసన్నద్ధంలో భాగం చేసుకుంది. దేశ వాయువ్య ప్రాంతంలో నమూనాలను ఏర్పాటు చేసి వాటిని ధ్వంసం చేసేందుకు కావాల్సిన యంత్రాలతో ప్రాక్టీస్​ చేసుకుంటోంది. అమెరికా కొలరాడోకు చెందిన ఓ సంస్థ తాజాగా తీసిన ఉపగ్రహ చిత్రాల్లో ఈ వ్యవహారం బయటపడింది.

china vs america wa
యుద్ధం కోసం చైనా ప్రాక్టీస్​- ఏకాంగా అమెరికా విమానాలతో..!

శత్రుదేశాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చైనా మాస్టర్​ ప్లాన్​ రచించింది. దేశ వాయువ్య ప్రాంతంలో అమెరికా యుద్ధనౌకల నమూనాలను, వాటిని ధ్వంసం చేసేందుకు కావాల్సిన యంత్రాలను ఏర్పాటు చేసింది. ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉద్రిక్తతలు కొనసాగుతుండగా.. భవిష్యత్తులో యుద్ధం వస్తే, సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు చైనా ప్రాక్టీస్​ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను అమెరికా కొలరాడో ఆధారిత మాక్సర్​ టెక్నాలజీస్​ సంస్థ బయటపెట్టింది.

china vs america wa
చైనా నిర్మించిన అమెరికా డమ్మీ నౌకలు

వాయువ్య జిన్​జియాంగ్​లోని రుయేకియాంగ్​ ప్రాంతంలో చైనా ఈ కార్యకలపాలు సాగిస్తున్నట్టు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి.

china vs america wa
అమెరికా నౌకలను పోలిన డమ్మీ నౌకలు

ఇటీవలి కాలంలో చైనా తన సైనిక శక్తిని విపరీతంగా పెంచుకుంటోంది. దక్షిణ చైనా సముద్రం, తైవాన్​, ఇండో-పెసిఫిక్​ ప్రాంతంలో చైనా పట్టు సాధిస్తుండటం అగ్రరాజ్యాన్ని కలవరపెడుతోంది. ఈ విషయాన్ని అనేకమార్లు బహిరంగంగానే వెల్లడించింది అమెరికా. ఈ తరుణంలో ఉపగ్రహ చిత్రాలు బయటపడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

china vs america wa
చైనా డమ్మీ నౌకలు

ఇదీ చదవండి:'భారత్​, తైవాన్​పై చైనా గురి- ఏడాదిలో 250 క్షిపణి పరీక్షలు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.