దాయాది పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. అమెరికా నుంచి సమగ్ర గగనతల రక్షణ వ్యవస్థను భారత్ కొనుగోలు చేయడంపై తన అక్కసును వెళ్లగక్కింది. ఇప్పటికే ప్రాంతీయ ఉద్రిక్తతలు పెచ్చుమీరుతున్న నేపథ్యంలో భారత్‌కు సమకూరే గగనతల రక్షణ వ్యవస్థ పరిస్థితులను మరింత అస్థిరపరిచే అవకాశం ఉందని ఆరోపించింది.
పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆయేషా ఫరూఖీ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
"ఇంత సమర్థవంతమైన ఆయుధసంపత్తిని భారత్‌కు అమ్మడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో మరిస్థితులు మరింత అస్థిరంగా ఉండేందుకు అవకాశం కన్పిస్తోంది. పాక్ సహా దక్షిణాసియాలో వ్యూహాత్మక సమతూకానికి అమెరికా నిర్ణయం విఘాతం కలిగించింది. పాక్ పట్ల భారత రాజకీయ, మిలిటరీ నేతలు అనుసరిస్తున్న వైఖరి అంతర్జాతీయ సమాజానికి తెలుసు. ఆయుధాల కొనుగోలు రేసులో దక్షిణాసియా నిలవలేదు."
-ఆయేషా ఫరూఖీ, పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
1.9 బిలియన్ డాలర్ల ధరకు భారత్‌కు సమగ్ర గగనతల రక్షణ వ్యవస్థను అందించేందుకు ఆమోదించింది అమెరికా. తమ గగనతల రక్షణ వ్యవస్థ, సైనిక వ్యవస్థలను ఆధునీకీకరించేందుకు అమెరికా ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.
ఇదీ చూడండి: ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు