ETV Bharat / international

91 శాతం సమర్థంగా రష్యా వ్యాక్సిన్​: లాన్సెట్​ - లాన్సెట్​ అధ్యయనం

రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్​వీ కరోనా టీకా 91 శాతానికిపైగా సమర్థంగా పనిచేస్తుందని లాన్సెట్​ స్టడీ ప్రచురించింది. ఎవ్వరిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపలేదని స్పష్టం చేసింది.

author img

By

Published : Feb 3, 2021, 6:08 AM IST

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌వీ వ్యాక్సిన్‌.. 91 శాతం సమర్ధవంతంగా పనిచేస్తుందని లాన్సెట్‌ స్టడీ ప్రచురించింది. ఈ వ్యాక్సిన్‌పై చేసిన మూడో దశ ట్రయల్స్‌తోపాటు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని స్పుత్నిక్‌వీ టీకా సమర్ధతని లెక్కగట్టామని ఆ దేశ పరిశోధకులు వెల్లడించారు.

ట్రయల్స్​లో పాల్గొన్న దాదాపు 20 వేల మందినుంచి సమాచారాన్ని విశ్లేషించినట్లు లాన్సెట్​ తెలిపింది. ఎవ్వరిపైనా పెద్దగా ప్రతికూల ప్రభావం చూపలేదని స్పష్టం చేసింది.

ప్రపంచంలోనే మెుట్టమెుదటగా కరోనా వ్యాక్సిన్‌ను తామే తయారు చేశామని రష్యా గతేడాది ఆగస్టు 11న ప్రకటించింది. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇదీ చూడండి: మూణ్నెళ్లా.. ఆర్నెళ్లా.. రెండేళ్లా? ఏ టీకా పవరెంత?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.