ETV Bharat / international

రష్యాలో కరోనా ఉగ్రరూపం- 80 లక్షలు దాటిన కేసులు

రష్యాలో కరోనా విజృంభణ(Russia covid cases) కొనసాగుతోంది. కరోనా రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఆ దేశంలో ఇప్పటివరకు 80 లక్షల మందికి వైరస్ సోకినట్లు తేలింది. మరోవైపు.. జపాన్​లో అనూహ్యంగా కరోనా(Japan Corona Cases) తగ్గుముఖం పట్టింది. అయితే.. వైరస్ వ్యాప్తి తగ్గడానికి గల కారణాలను అక్కడి నిపుణులు విశ్లేషిస్తున్నారు.

corona cases in russia
రష్యాలో కరోనా కేసులు
author img

By

Published : Oct 18, 2021, 6:14 PM IST

రష్యాలో(Russia covid cases) కరోనా మహమ్మారి (Corona virus in Russia) ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. ఆ దేశంలో ఇప్పటివరకు వైరస్ బారిన పడినవారి సంఖ్య 80 లక్షలు దాటింది. ఇది ఆ దేశ జనాభాలో 5శాతం కంటే ఎక్కువ కావడం గమనార్హం. కొత్త కేసులు కూడా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. రష్యాలో కొత్తగా 34,325 మందికి కరోనా సోకిందని అక్కడి అధికారులు తెలిపారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 80,27,012కు చేరిందని చెప్పారు. వైరస్ ధాటికి మరో 998 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.

మరోవైపు.. రష్యాలో కొవిడ్ వ్యాక్సినేషన్​ను వేగవంతం చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. లబ్ధిదారులకు లాటరీలు, బోనస్​లు, ప్రోత్సాహకాలు వంటివి ప్రకటిస్తున్నారు. అయినప్పటికీ.. టీకాలపై ప్రజల్లో ఉన్న అపోహల కారణంగా.. ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. రష్యావ్యాప్తంగా ఇప్పటివరకు 32శాతం మందికి కరోనా పూర్తి టీకా డోసులు పంపిణీ చేసినట్లు అక్కడి అధికారులు సోమవారం తెలిపారు.

జపాన్​లో తగ్గుముఖం...

మరోవైపు... జపాన్​లో కరోనా వ్యాప్తి(Japan Corona Cases) అనూహ్యంగా తగ్గముఖం పట్టింది. ఆ దేశ రాజధాని టోక్యోలో ఆగస్టు మధ్యలో రోజువారీ కేసులు దాదాపు 6,000గా నమోదు కాగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 100 కంటే తక్కువకు పడిపోయింది. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడం వల్ల ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం బార్లు, రైళ్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. అయితే.. ఇలా ఆకస్మాత్తుగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడానికి గల కారణాలేంటో అక్కడి అధికారులకు అంతుచిక్కడం లేదు.

తెలియకపోతే మరో దశ...

టీకా పంపిణీ, మాస్కులు ధరించడం, ఆగస్టు నుంచి ప్రజలు బయట తిరిగేందుకు అనుకూల వాతావరణం లేకపోవడం, చాలా ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూ విధించడమే.. జపాన్​లో కరోనా తగ్గుముఖం పట్టడానికి కారణమా? అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనికి కచ్చితమైన కారణాలు తెలుసుకోలేకపోతే.. మరో దశ వైరస్​ వ్యాప్తి పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

జపాన్​లో ఇప్పటివరకు 70 శాతం మందికి పూర్తి స్థాయి టీకా డోసులు అందాయి.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.