ETV Bharat / international

'అత్యంత శక్తిమంతమైన.. రష్యా అణ్వాయుధాగారం!'

Russia-Ukraine Conflict: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం భీకరంగా సాగుతోంది. సైనిక, ఇంధన స్థావరాలే లక్ష్యంగా రష్యా దళాలు దాడులు చేస్తున్నాయి. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్​ తన అణ్వస్త్ర బలగాలతో బెదిరింపులకు దిగారు. అతిపెద్ద అణ్వాయధ సామర్థ్యం కలిగి ఉన్న రష్యా .. ఏం చేస్తుందో అనే భయాందోళనలో ప్రపంచ దేశాలు ఉన్నాయి.

russia ukraine crisis
రష్య అణ్వస్తం
author img

By

Published : Feb 28, 2022, 10:54 AM IST

Russia-Ukraine Crisis: ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇప్పుడు భారీ బెదిరింపులకు దిగారు. తన అణ్వస్త్ర బలగాలకు అప్రమత్తత సందేశం ఇవ్వడం ద్వారా ప్రపంచదేశాలను ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేశారు. ఈ నేపథ్యంలో రష్యా అణ్వస్త్ర సామర్థ్యం చర్చనీయాంశమైంది. సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నమయ్యాక రష్యాకు పెద్ద సంఖ్యలో అణ్వాయుధాలు వారసత్వంగా సంక్రమించాయి. ఆ తర్వాతికాలంలో వాటిని గణనీయంగా తగ్గించుకుంది. అయినా ఇప్పటికీ ప్రపంచంలో అతిపెద్ద అణ్వాయుధాగారాన్ని ఆ దేశం కలిగి ఉంది. ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ అమెరికన్‌ సైంటిస్ట్స్‌’ అంచనా ప్రకారం 2022 నాటికి రష్యా వద్ద 5,977 అణ్వస్త్రాలు ఉన్నాయి. వాటిలో 1,588 వార్‌హెడ్లను బాలిస్టిక్‌ క్షిపణుల్లో, భారీ బాంబర్‌ యుద్ధవిమానాల స్థావరాల్లో మోహరించింది. మిగతావాటిని రిజర్వులో ఉంచింది.

ప్రయోగ పద్ధతి ఇలా..

రష్యా వద్ద ఉన్న ఖండాంతర క్షిపణులు.. ప్రయోగించిన 10 నిమిషాల తర్వాత సెకనుకు నాలుగు మైళ్ల వేగాన్ని అందుకోగలవు. ఈ లెక్కన అవి బ్రిటన్‌ను 20 నిమిషాల్లో చేరుకోగలవు. అణ్వస్త్ర ప్రయోగం కోసం రష్యా ఒక ఆదేశిక వ్యవస్థను రూపొందించుకుంది. దీని ప్రకారం ఈ బాంబు ప్రయోగానికి దేశాధ్యక్షుడు, రక్షణ మంత్రి లేదా చీఫ్‌ ఆఫ్‌ ద జనరల్‌ స్టాఫ్‌ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ‘చెగెట్‌ అణు సూట్‌కేస్‌’ ద్వారా భద్రంగా ఈ ప్రక్రియ సాగుతుంది. వీటి ఆధారంగా అణ్వస్త్రాలను ‘అన్‌లాక్‌’ చేసి, ప్రయోగానికి పచ్చజెండా ఊపే అధికారం సైనికాధికారులకు ఉంటుంది. ఉక్రెయిన్‌ యుద్ధంలో ఇప్పటివరకూ అటు అణ్వస్త్రాలు, ఇటు సాధారణ ఆయుధాలనూ ప్రయోగించే ‘డ్యుయెల్‌ కేపబుల్‌’ వాహనాల’ను ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో మోహరించింది. అయితే అణ్వస్త్రాలను కానీ వాటిని ప్రయోగించే బలగాలను కానీ రంగంలోకి దించిన సంకేతాలు ఎక్కడా లేవు.

జార్‌ బాంబుతో గుండెలు బేజారు..

1961లో సోవియట్‌ యూనియన్‌ ‘జార్‌’ బాంబును పరీక్షించింది. మానవ చరిత్రలో నిర్వహించిన అత్యంత శక్తిమంతమైన విస్ఫోటంగా ఆ పరీక్ష నిలిచింది. ఆ పేలుడు తీవ్రతకు వెలువడిన ప్రకంపన శక్తిని అంతరిక్షంలో ఉన్న సెన్సర్లు కూడా పసిగట్టాయి. ఈ థర్మోన్యూక్లియర్‌ బాంబుకు 57 మెగాటన్నుల పేలుడు సామర్థ్యం ఉంది. ఇది హిరోషిమా, నాగసాకిపై ప్రయోగించిన రెండు అణుబాంబుల ఉమ్మడి శక్తి కన్నా 1500 రెట్లు అధికం. ఇలాంటివి రష్యా వద్ద ఉన్నాయి.

* ఇప్పుడు 100 మెగాటన్నుల సామర్థ్యం కలిగిన అణ్వస్త్రాన్ని రష్యా అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ‘స్టాటస్‌-6 ఓషన్‌ మల్టీపర్పస్‌ సిస్టమ్‌’ అనే ఈ అస్త్రాన్ని సముద్రంలో ప్రయోగిస్తారు. ఫలితంగా 500 మీటర్ల ఎత్తయిన సునామీ కెరటం చెలరేగుతుంది. దానివల్ల శత్రు తీర ప్రాంతం అణు రేడియోధార్మికతతో కలుషితమవుతుంది.

russia weapons list
అణ్వాయుధాల సంఖ్య

ఇదీ చదవండి: తగ్గేదేలే అంటున్న ఉక్రెయిన్​.. పుతిన్‌ అంచనాలు తప్పాయా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.