ETV Bharat / international

ట్విట్టర్‌పై రష్యా ఆంక్షలు.! - రష్యా Vs ట్విట్టర్​

సామాజిక మాధ్యమం ట్విట్టర్​పై రష్యా ఆంక్షలు విధించడం ప్రారంభించింది. కంటెంట్​ విషయంలో ప్రభుత్వ ఆదేశాలను‌ పట్టించుకోకపోవడం వల్లే ఈ ఆంక్షలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.

Russia slows down Twitter part of Social media clampdown
ట్విట్టర్‌పై రష్యా ఆంక్షలు.!
author img

By

Published : Mar 10, 2021, 10:54 PM IST

సామాజిక మాధ్యమం ట్విట్టర్‌పై రష్యా కూడా ఆంక్షలు మొదలుపెట్టింది. ఫొటోలు, వీడియోలను ట్విట్టర్‌లో అప్‌లోడ్‌ చేయడంలో స్పీడ్‌ తగ్గించింది. నిషేధిత కంటెంట్‌ను తొలగించడంలో ట్విట్టర్​ విఫలమైనందుకు ఈ ఆంక్షలు కొనసాగిస్తున్నామని వెల్లడించింది.

పిల్లల్లో ఆత్మహత్యలను ప్రేరేపించడం, డ్రగ్స్‌, చైల్డ్‌ పోర్నోగ్రఫీ వంటి నిషేధిత సమాచారాన్ని తొలగించడంలో ట్విట్టర్‌ విఫలమైందని రష్యా సమాచార నియంత్రణ సంస్థ రోస్కోమ్నాడ్జోర్ వెల్లడించింది. దీనిపై ట్విట్టర్‌ సరైన రీతిలో స్పందిస్తుందనే నమ్మకం ఉందని.. అయితే, రష్యా చట్టాలను అమలు చేయకపోతే పూర్తిగా నిషేధిస్తామని హెచ్చరించింది.

ట్విట్టర్‌పై ఆంక్షలు విధించే అంశంపై రష్యా అధ్యక్ష కార్యాలయ అధికార ప్రతినిధి దిమిత్రియ్‌ పెస్కోవ్‌ స్పందించారు. సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించాలనే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని.. కానీ చట్టానికి అనుగుణంగా పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

ఆంక్షలు అందుకేనా.?

ట్విట్టర్‌పై రష్యా ఆంక్షలు విధించడానికి ఇతర కారణాలు కూడా ఉన్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావెల్నీని ప్రభుత్వం అరెస్టు చేయడం వల్ల పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఆయన్ను విడుదల చేయాలంటూ దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలు ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులను ఏకతాటిపై తీసుకురావడంలో ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాలే కీలకంగా వ్యవహరించాయని రష్యా ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా నిరసనల్లో పాల్గొనాలని పిల్లలకు పిలుపునివ్వడం వంటి చర్యలను అక్కడి ప్రభుత్వం తప్పుబడుతోంది. రష్యా చట్టాలకు వ్యతిరేకంగా ఉన్న ఇలాంటి సమాచారాన్ని సామాజిక మాధ్యమాలు తొలగించాలని ప్రభుత్వం పేర్కొంది. ఇలా కంటెంట్‌ విషయంలో ప్రభుత్వ ఆదేశాలను ట్విట్టర్‌ పట్టించుకోకపోవడం వల్లే ఈ ఆంక్షలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఈ నెల 12న ఒకే వేదికపై మోదీ, బైడెన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.