ETV Bharat / international

రష్యాలో కరోనా కల్లోలం- 'డెల్టా'ను మించి.. - ఉక్రెయిన్​లో కరోనా కేసులు

రష్యాలో కరోనా(Russia covid cases) విజృంభణకు కారణమవుతున్న డెల్టా ఉపరకం(Delta Sub Variant Russia) ఏవై 4.2.. డెల్టా వేరియంట్​ కంటే 10 శాతం ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. అయితే అది నిదానంగా జరిగే ప్రక్రియని చెప్పారు. ఈ ఉపరకం కారణంగా రష్యాలో... రోజుకు 30వేలకు పైగా కేసులు, వెయ్యికి పైగా మరణాలు నమోదవుతున్నాయి.

delta sub variant in russia
రష్యాలో కరోనా ఉపరకం
author img

By

Published : Oct 22, 2021, 9:19 PM IST

Updated : Oct 23, 2021, 10:03 PM IST

రష్యాలో కరోనా వైరస్(Russia covid cases) కల్లోలం సృష్టిస్తోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ కేసులకు(Russia covid cases) కారణమవుతున్న ఉపరకం ఏవై.4.2(Delta Sub Variant Russia)... డెల్టా వేరియంట్ కంటే అధిక సంక్రమణ వేగం కలిగి ఉందని భావిస్తున్నారు. ఈ మేరకు అక్కడి మీడియాతో ఆ దేశ సీనియర్ పరిశోధకులు ఒకరు వెల్లడించారు. ఈ డెల్టా ఉపరకం.. డెల్టా కంటే 10 శాతం ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆయన అన్నారు. అయితే అది నిదానంగా జరిగే ప్రక్రియని చెప్పారు. 'టీకాలు ఈ ఉపరకంపై(Delta Sub Variant Russia) మెరుగ్గానే పనిచేస్తున్నాయి. ఉన్నట్టుండి యాంటీబాడీల సామర్థ్యాన్ని దెబ్బతీసేంత ఉత్పరివర్తనేమీ జరగలేదు' అని అన్నారు. ఈ ఉపరకంతో ఇప్పటికే ఉన్న రికార్డు స్థాయి ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోపక్క బ్రిటన్‌లోనూ ఏవై.4.2 ప్రభావం కనిస్తోంది. అక్కడ కూడా రోజుకు దాదాపు 50 వేల కేసులు వెలుగుచూస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. రష్యాలో రోజుకు 30 వేలకు పైగా కేసులు(Corona virus in Russia) , వెయ్యికి పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఆ దేశం ఇంతవరకు ఈ స్థాయి ఉద్ధృతిని చవిచూడలేదు. వరల్డో మీటర్ గణాంకాల ప్రకారం.. కరోనా ప్రారంభం నుంచి 81లక్షలకు పైగా కేసులు.. 2.28 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా మునుపటి ఉద్ధృతికి డెల్టా వేరియంట్ కారణం. భారత్‌లో రెండో దశలో ఆ వేరియంట్‌ మృత్యు ఘంటికలు మోగించింది.

వారం రోజులు సెలవులు..

కరోనా విజృంభణతో ఇప్పటికే ఉద్యోగులకు వారం రోజుల పాటు సెలవులు ఇవ్వాలని రష్యా ప్రభుత్వం నిర్ణయించింది. ఆఫీసుకు రాకున్నా జీతాలిస్తామని తెలిపింది. అక్టోబర్​ 30 నుంచి నవంబర్ 7వరకు ఈ సెలవులు ఉంటాయి. వారం రోజుల్లో నాలుగు రోజులు అధికారిక ప్రభుత్వ సెలవులే కావడం గమనార్హం.

ఉక్రెయిన్​లో ఉద్ధృతి..

మరోవైపు ఉక్రెయిన్​లో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కొత్తగా ఆ దేశంలో 23,785 మందికి కరోనా సోకినట్లు తేలింది. మరో 614 మంది వైరస్ ధాటికి మృతి చెందారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ఆ దేశ రాజధాని కైవ్​లో శుక్రవారం నుంచి రెండు వారాల పాటు పాఠశాలలను మూసివేస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. వైరస్ ప్రభావితమైన ఇతర ప్రాంతాల్లోనూ ఇదే తరహా కట్టడి చర్యలు కొనసాగుతున్నాయి.

ఉక్రెయిన్​లో కరోనా వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతోంది. ఇప్పటివరకు ఆ దేశంలో 15శాతం మందికే పూర్తి స్థాయి.. కరోనా టీకా పంపిణీ చేశారు.

ఇవీ చూడండి:

చైనాలో మళ్లీ కరోనా వ్యాప్తి- స్కూళ్లు, విమానాలు బంద్​

కరోనా విజృంభణతో ఆ దేశంలో మళ్లీ లాక్​డౌన్

Last Updated : Oct 23, 2021, 10:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.