ETV Bharat / international

రష్యాపై కరోనా పంజా.. ఒక్కరోజే 10వేల కేసులు - ప్రపంచంలో కరోనా మరణాలు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్​ విజృంభణ కొనసాగుతోంది. రష్యాలో ఇవాళ మరో 10 వేల కేసులు నమోదుకాగా.. మొత్తం బాధితుల సంఖ్య లక్షా 34 వేలు దాటింది. అలాగే సౌదీ అరేబియాలోనూ గడిచిన 24 గంటల్లో 15 వందల మందికి పైగా వైరస్​ సోకింది. మెక్సికోలో 1,349, పాకిస్థాన్​లో 1,297 కేసులు నమోదయ్యాయి.

Russia registers new single-day record of 10,633 COVID-19 cases
రష్యాలో కొనసాగుతోన్న కరోనా ఉద్ధృతి... 10 వేలకుపైగా కేసులు
author img

By

Published : May 3, 2020, 7:53 PM IST

Updated : May 3, 2020, 8:04 PM IST

ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ మృత్యు విలయాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటి వరకు అంతర్జాతీయంగా 35 లక్షల 8 వేల మందికి పైగా వైరస్​ సోకింది. అన్ని దేశాల్లో కలిపి ఇప్పటి వరకు 2 లక్షల 45 వేలకు పైగా మరణాలు సంభవించాయి. 11,30,299 మంది బాధితులు కోలుకున్నారు.

Russia registers new single-day record of 10,633 COVID-19 cases
మొత్తం కేసులు

రష్యాలో నేడు 10 వేలకు పైగా కేసులు

రష్యాలో వైరస్​ విలయతాండవం చేస్తూనే ఉంది. ఇవాళ ఒక్కరోజే రికార్డు స్థాయిలో 10,633 మందికి వైరస్​ సోకింది. దీంతో రష్యాలో మొత్తం 1,34,687 మంది మహమ్మారి బారినపడ్డారు. ఇవాళ కొత్తగా 58 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు వైరస్​ సోకి మరణించినవారి సంఖ్య 1,280కి చేరింది. 16,639 మందికి వైరస్ నయమైంది.

సౌదీ అరేబియాలో పెరుగుతోన్న కేసులు

సౌదీ అరేబియాలోనూ కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 1,552 మందికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఫలితంగా సౌదీలో మొత్తం 27,011 మంది మహమ్మారి బాధితులు ఉన్నట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 184 మంది మృతి చెందారు.

మెక్సికోలో మరో 13 వందలకు పైగా కేసులు

మెక్సికోలో ఇవాళ 1,349 కేసులు నమోదయ్యాయి. మరో 89 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణించిన వారి సంఖ్య 2,061కు చేరింది. దేశంలో 22,088 మంది మహమ్మారి బాధితులు ఉండగా.. 13,447మంది ఆసుపత్రి నుంచి కోలుకున్నారు.

పాకిస్థాన్​లో మరో 1,297 కేసులు

పాకిస్థాన్​లో వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. రోజూ వందల సంఖ్యలో పాజిటివ్​ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 989 మందికి వైరస్​ సోకగా.. మొత్తం బాధితుల సంఖ్య 19,103కు చేరింది. ఇప్పటి వరకు అక్కడ 440మంది మహమ్మారికి బలయ్యారు. దేశంలో పెరుగుతున్న కేసులపై స్పందించారు పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​. "వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో తెలియదు.. మరో అర్నెళ్ల నుంచి ఏడాదిపాటు వైరస్​తో సహజీవనం చేయక తప్పదు" అని ప్రజలను హెచ్చరించారు.

ఇరాన్​లో 24 గంటల్లో 976 కేసులు

ఇరాన్​లో క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 976 కేసులు నమోదయ్యాయి. మరో 47 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 97,424కి పెరిగింది. ఇప్పటి వరకు అక్కడ 6,203 మంది వైరస్​ బారిన పడి మరణించారు.

సింగపూర్​లో మరో 657 బాధితులు

సింగపూర్​లో కరోనా కేసులు ఆగట్లేదు. ఇవాళ 657 మందికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లు అ దేశ యంత్రాంగం ప్రకటించింది. దీంతో ఆ దేశంలో మొత్తం కొవిడ్​-19 బాధితుల సంఖ్య 18 వేలకు పెరిగింది. వీరిలో 1,347 మంది రికవరీ అయ్యారు.

  • కరోనా పుట్టినిల్లు అయిన చైనాలో రోజురోజుకూ వైరస్​ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా కేవలం 2 కొత్త కేసులను గుర్తించారు అధికారులు. దీంతో ఇప్పటి వరకు 82,877 మందికి వైరస్​ సోకింది.
  • దక్షిణ కొరియాలో ఇప్పటివరకు మొత్తం 10,793 మందికి వైరస్​ సోకగా.. 250 మంది ప్రాణాలు కోల్పోయారు. 9,183 మంది పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 1360 యాక్టివ్​ కేసులున్నాయి.
  • బెల్జియంలో రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్న కారణంగా ఆ దేశంలో మొత్తం 49,906 మందికి వైరస్ సోకింది. తాజాగా మరో 62 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు 7,765 మంది మరణించారు.
  • నెదర్లాండ్స్​​లో గడిచిన 24 గంటల్లో 335 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలగా...మొత్తం బాధితుల సంఖ్య 40 వేలకు పెరిగింది. వీరిలో 5 వేల మంది వైరస్​కు బలయ్యారు.
  • బ్రెజిల్​లో ఇవాళ 5 వందల మందికి పైగా కరోనా సోకింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 97,100 మంది బాధితులు ఉన్నట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. 6,761 మంది మృతి చెందారు.
  • బంగ్లాదేశ్​లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 665 మందికి వైరస్​ సోకగా.. మొత్తం 9,455 మంది బాధితులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 177 మంది మృతి చెందారు.

Last Updated : May 3, 2020, 8:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.