అమెరికాలో ఈ ఏడాది జనవరిలో జరిగిన క్యాపిటల్ ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం ఓ సమావేశంలో ప్రస్తావించారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌నకు మద్దతుగా అల్లర్లు సృష్టించిన నిరసనకారులను ఎద్దేవా చేశారు. వారు అమెరికా కాంగ్రెస్‌కు షికారు చేయడానికి వచ్చారని వ్యాఖ్యానించారు. రష్యా ఎప్పుడూ అమెరికా శాంతిని కోరుకుంటుందని పేర్కొన్నారు.
జనవరి 6న బైడెన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేపడుతూ క్యాపిటల్‌కు చేరుకున్న నిరసనకారులు ఆ ప్రాంతంలో విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి : మాస్క్ ధరించమన్నందుకు డ్రైవర్‌తో గొడవ