ETV Bharat / international

Russia fines Google: గూగుల్​కు రష్యా షాక్​.. రూ. 750 కోట్ల ఫైన్​ - international news in telugu

Russia fines Google: టెక్ దిగ్గజం గూగుల్​కు రష్యా కోర్టు షాకిచ్చింది. నిషిద్ధ కంటెంట్​ను తొలగించనందుకు దాదాపు 100 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

Russian court fines Google nearly $100M over content

author img

By

Published : Dec 24, 2021, 9:52 PM IST

Russia fines Google: రష్యాలోని మాస్కో కోర్టు సెర్చ్​ ఇంజిన్ దిగ్గజం గూగుల్​కు దాదాపు 100 మిలియన్​ డాలర్ల (దాదాపు రూ. 750 కోట్లు) జరిమానా విధించింది. స్థానిక చట్టాల ప్రకారం నిషేధిత కంటెంట్​ను డిలీట్ చేయనుందుకు గానూ ఇంత పెద్ద మొత్తంలో ఫైన్ చెల్లించాలని ఆదేశించింది. టగన్ స్కై జిల్లా కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పదే పదే చెప్పినా కంటెంట్​ను తొలగించకుండా గూగుల్​ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పేర్కొంది.

కోర్టు ఆదేశాలను వివరంగా చదివి తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తామని గూగుల్​ ఓ ప్రకటనలో తెలిపింది.

సామాజిక మాధ్యమాల్లో డ్రగ్స్​, ఆయుధాలు, పేలుడు పదార్థాలకు సంబంధించి కంటెంట్​ను తొలగించాలని రష్యా ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. విదేశీ టెక్ సంస్థలు రష్యా పౌరుల డేటాను తమ దేశంలోని సర్వర్లలోనే భద్రపరచాలని ఇప్పటికే తేల్చి చెప్పింది. స్థానిక చట్టాలను టెక్ సంస్థలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. రష్యా ఈ ఏడాదిలో ఇప్పటికే గూగుల్, ఫేస్​బుక్​, ట్విట్టర్​ సంస్థలకు జరిమానాలు విధించింది. అయితే ఇంత పెద్ద మొత్తంలో ఫైన్​ చెల్లించమనడం మాత్రం ఇదే తొలిసారి.

రష్యాలో గూగుల్ కార్యకలాపాలు మాత్రం యథావిధిగా కొనసాగించుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. చట్టాలను మాత్రం కచ్చితంగా పాటించాల్సిందేనని పేర్కొంది.

ఇదీ చదవండి: బైడెన్​ కీలక నిర్ణయం- ఆ దేశాలపై ప్రయాణ ఆంక్షలు ఎత్తివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.