125 మంది రోహింగ్యాలతో వెళ్తున్న పడవ మునిగిపోయిన ఘటన బంగ్లాదేశ్ సెయింట్ మార్టిన్ ద్వీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 14 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు స్పష్టం చేశారు. మరో 62 మంది సురక్షింతగా బయటపడినట్లు పేర్కొన్నారు.
సామర్థ్యానికి మించి ఎక్కువ మందిని పడవలో ఎక్కించుకున్నందున ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. తీర రక్షక దళాలు, నౌకాదళం డైవర్లు, ఇతర విపత్తు దళాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు.
రోహింగ్యా ముస్లింలు మయన్మార్ నుంచి ఇతర దేశాలకు వలస వెళ్లడం కొన్నేళ్లుగా ఎక్కువైంది. ఇలా దేశం దాటే క్రమంలో ప్రమాదాలకు గురై ఇప్పటికే అనేక మంది చనిపోయారు.