అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో ఇంధన ట్యాంకర్లకు మంటలు అంటుకుని ఏడుగురు మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించినట్లు వివరించారు. ఇది ప్రమాదమా? లేక ప్రతీకార చర్యనా? అనే దానిపై ఎటువంటి సమాచారం లేదు. మొదట ఓ ఇంధన ట్యాంకర్ నిప్పు అంటుకోవడం వల్ల మంటలు చెలరేగినట్లు ప్రాథమిక దర్యాప్తుతో తేలిందని అధికారులు వెల్లడించారు. అక్కడి నుంచి సమీపంలో ఉన్న మిగతా ట్యాంకర్లకు మంటలు వేగంగా వ్యాపించాయన్నారు.
అఫ్గానిస్థాన్‌లో ఉన్న అమెరికా, నాటో తుది దశ బలగాల ఉపసంహరణ శనివారం అధికారికంగా ప్రారంభమైంది. ఇదే రోజున ఈ ఘటన జరగడంపై కొంత అనుమానాలు నెలకొన్నాయి. అయితే జరిగిన ఘటన ప్రమాదమా? దాడి నా? అనే దానిపై ప్రాథమికంగా ఎటువంటి సమాచారం లేదని అధికారులు పేర్కొన్నారు. అమెరికాకు చెందిన సుమారు 3,500 మంది సైనికులు సహా నాటోకు చెందిన 7000 మంది అఫ్గానిస్థాన్ నుంచి తిరుగు ప్రయనమయ్యాయి. 20 ఏళ్ల కింద అమెరికాలో సెప్టెంబర్ 11న జరిగి దాడి తరువాత అగ్రరాజ్యం బలగాలను ప్రవేశపెట్టింది.
ఇదీ చూడండి: అఫ్గాన్‌లోని అమెరికా బలగాల ఉపసంహరణ షురూ!