ETV Bharat / international

Kabul Airport: కాబుల్​ ఎయిర్​పోర్ట్​లో మళ్లీ ఎగిరిన విమానం..! - తాలిబన్​

అఫ్గానిస్థాన్​ నుంచి అమెరికా బలగాలు వెల్లిపోయిన తర్వాత కాబుల్​ విమానాశ్రయంలో(Kabul Airport) తొలి విమానం ఎగిరింది. ఈ మేరకు ట్విట్టర్​ వేదికగా ఓ వీడియోను షేర్​ చేశారు తాలిబన్​ ప్రతినిధి.

Hamid Karzai International Airport
కాబుల్​ ఎయిర్​పోర్ట్​లో మళ్లీ ఎగిరిన విమానం
author img

By

Published : Sep 2, 2021, 8:30 PM IST

అఫ్గానిస్థాన్​ నుంచి అమెరికా బలగాలు స్వదేశానికి వెళ్లిపోయిన క్రమంలో కాబుల్​లోని హమిద్​ కర్జాయ్​ అంతర్జాతీయ విమానాశ్రయం(Kabul Airport) పూర్తిగా తాలిబన్ల(Afghanistan Taliban) చేతికి వెళ్లిపోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక్క విమానం కూడా ఎగరలేదు. అయితే.. తాజాగా కాబుల్​ విమానాశ్రయంలో కతార్​ మిలిటరీకి చెందిన ఓ విమానం దిగినట్లు తాలిబన్​ మీడియా ప్రతినిధి ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

కతార్​ మిలిటరీ విమానానికి సంబంధించిన ఫొటోతో పాటు వీడియోను ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు తాలిబన్​ ప్రతినిధి అహ్మదుల్లా ముత్తాకి. కాబుల్​ విమానాశ్రయంలో మళ్లీ విమానం గర్జన వినిపించిందని రాసుకొచ్చారు.

  • همدا اوس دقطر ایرلاین الوتکي په کابل ميدان هوايي کي بله ناسته وکړه pic.twitter.com/rpeWz7QdNd

    — Ahmadullah Muttaqi (@Ahmadmuttaqi01) September 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గత మంగళవారం విమానాశ్రయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తాలిబన్లు కీలక ప్రకటన చేశారు. కొద్ది రోజుల్లో పౌరు విమాన సేవలు ప్రారంభమవుతాయని, అయితే.. మిలిటరీ సంబంధ కార్యకలాపాలు కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: Kabul Airport: తాలిబన్ల వశమయ్యాక కాబుల్​ ఎయిర్​పోర్ట్ ఇలా...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.