ఒలింపిక్స్‌కు రెండు వారాల ముందు జపాన్ రాజధాని టోక్యోలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మే నెల మధ్య నుంచి పోలిస్తే అత్యధికంగా కొత్తగా 920 కేసులు బయటపడ్డాయి. వైరస్ నివారణ చర్యలపై చర్చించేందుకు జపాన్ ప్రధాని యోషిహిదే షుగా అత్యవసర సమావేశం నిర్వహించారు.
అత్యవసర పరిస్థితి దిశగా..
మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. నిపుణుల బృందంతో చర్చించిన అనంతరం నగరంలో అత్యవసర పరిస్థితి విధింపుపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. అత్యవసర పరిస్థితి విధించినట్లయితే.. ప్రేక్షకులకు అనుమతి నిరాకరించే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అంతేగాక.. తక్కువ జనసామర్థ్యమున్న వేదికల్లో ఒలింపిక్స్ నిర్వహించే ప్రణాళికలను రూపొందించనున్నట్లు తెలిపారు.
ఒలింపిక్స్‌తో పాటు.. వేసవి సెలవులు సమీపిస్తున్న తరుణంలో కొవిడ్ పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ వైద్య సలహాదారు డాక్టర్ షిగెరు ఓమి సూచించారు. జపాన్‌లో ఇప్పటివరకూ 8,10,000 కరోనా కేసులు నమోదుకాగా.. దాదాపు 14,900 మరణించారు. దేశప్రజల్లో 15 శాతం మందికి టీకా అందించారు.
ఇవీ చదవండి: