పశ్చిమ అఫ్గానిస్థాన్‌లోని ఓ కారాగారంలో జరిగిన గొడవ.. 8 మంది మృతికి దారి తీసింది. పశ్చిమ హేరత్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది. జైలులో సిబ్బంది శుభ్రం చేస్తుండగా ఈ ఘర్షణ చెలరేగినట్లు ఆ రాష్ట్ర అధికార ప్రతినిధి జిలానీ ఫర్హాద్ చెప్పారు.
అనుమానాలు..
ఈ ఘటనలో 8 మంది ఖైదీలతో పాటు నలుగురు పోలీసులు గాయపడ్డారని హేరత్ ఆసుపత్రి వైద్యుడు ఆరిఫ్ జిలాలీ చెప్పారు. ఇది తాలిబన్ల చర్యనేమో అని ఆరిఫ్ అనుమానం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారిలో ఒకరికి తుపాకీ గాయాలు ఉన్నాయని చెప్పారు. అయితే.. 2,000 మంది గల ఈ కారాగారంలో ఓ భాగాన్ని ఖైదీలు తగులబెట్టారని మరో అధికారి అంటున్నారు.
అఫ్గాన్ జైళ్లలో వసతుల లేమిపై ఆందోళనలు జరుగుతూనే ఉంటాయి. 2019లో కాబూల్‌లోని ఓ కారాగారంలో జరిగిన గొడవలో నలుగురు మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు.
ఇదీ చూడండి:'పాక్ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు'