ETV Bharat / international

13 మంది హజారాలను కిరాతకంగా చంపిన తాలిబన్లు!

అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల(Afghanistan Taliban) అనైతిక చర్యలను బయట పెట్టింది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్​. 13 మంది హజారాలను అతికిరాతకంగా చంపినట్లు పేర్కొంది. వీరిలో 11 మంది సైనికులు ఉన్నట్లు తెలిపింది. కుటుంబ సభ్యులతో పారిపోతున్నవారిపై విచక్షణారహితంగా తాలిబన్లు కాల్పులు జరిపినట్లు వెల్లడించింది.

Afghanistan Taliban
తాలిబన్ల అరాచకం
author img

By

Published : Oct 5, 2021, 5:48 PM IST

అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల(Afghanistan Taliban) అరాచకాలను ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్​ బయటపెట్టింది. ​హజారా జాతికి చెందిన 13 మందిని కిరాతకంగా చంపారని తెలిపింది. వారిలో ఎక్కువమంది లొంగిపోయిన సైనికులే ఉన్నారని వెల్లడించింది. ఆగస్టు 30న దయకుంది ప్రావిన్స్​లోని కహోర్​​ గ్రామంలో ఈ చర్యకు తాలిబన్లు(Afghanistan Taliban) పాల్పడినట్లు ఆమ్నెస్టీ దర్యాప్తులో వెల్లడైంది. 11 మంది అఫ్గాన్​ భద్రతా సిబ్బంది, మరో ఇద్దరు పౌరులను తాలిబన్లు హతమార్చారు. అందులో 17 సంవత్సరాల బాలిక కూడా ఉన్నట్లు తేలింది. తాలిబన్లు అఫ్గానిస్థాన్​ను(Taliban news) ఆక్రమించుకున్న రెండు వారాల తర్వాత ఈ హత్యలు జరిగినట్లు పేర్కొంది.

ఆమ్నెస్టీ నివేదిక ప్రకారం.. దయకుంది ప్రావిన్స్​ను ఆగస్టు 14న తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఖిదిర్ జిల్లాలో 34 మంది మాజీ సైనికులు దేశ భద్రతకు ఎంతగానో శ్రమించారు. అయితే తాలిబన్లు చుట్టుముట్టడం వల్ల ఆయుధాలతో పాటు వారికి లొంగిపోవడానికి మొహమ్మద్​ అజీమ్​ సెదాఖత్ నేతృత్వంలో బృందం అంగీకరించింది.

Afghanistan Taliban
తాలిబన్ల అరాచకం

పారిపోతున్నా.. వదల్లేదు!

దహని కుల్​ గ్రామంలో మరికొందరు సైనికులు తమ కుటుంబసభ్యులతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నారు. ఈ విషయం తెలుసుకుని ఆగస్టు 30న.. 300 మంది తాలిబన్లు ఆ గ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలో తమకుటుంబ సభ్యులతో పాటు ఆ ప్రాంతాన్ని విడిచి పారిపోవడానికి ప్రయత్నించిన సైనికులపై తాలిబన్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 17ఏళ్ల బాలిక చనిపోయింది. ఓ సైనికుడు ఎదురుకాల్పులు జరపగా ఒక తాలిబన్​ హతమయ్యాడు. మరికొందరు గాయపడ్డారు. దీంతో పారిపోతున్న సైనికుల కుటుంబాలపై కిరాతకంగా తాలిబన్లు కాల్పులు జరపగా.. ఇద్దరు సైనికులు మృతి చెందారు. మరో 9 మంది లొంగిపోయారు. వారిని ఓ నది తీరానికి తీసుకెళ్లి దారుణంగా చంపారని ఆమ్నెస్టీ తెలిపింది. హత్యల తర్వాత ఆ ప్రాంతంలో తీసిన ఫొటోలు, వీడియో ఆధారంగా వీటిని ధ్రువీకరించినట్లు పేర్కొంది.

అఫ్గాన్​లో(Afghanistan latest news) 36 మిలియన్ల జనాభా ఉండగా.. అందులో హజారాలు దాదాపు 9 శాతం మంది ఉన్నారు. అఫ్గాన్​ సున్నీ ముస్లింలు అధికంగా ఉన్న దేశం. అందుకే షియా ముస్లింలు అయిన హజారాలే లక్ష్యంగా తరచూ దాడులు జరుగుతుంటాయి! దీనిపై స్పందించిన ఆమ్నెస్టీ ప్రధాన కార్యదర్శి ఆగ్నెస్​ కల్మార్డ్​.. తాలిబన్లు(Taliban news) ఎంతటి దారుణమైన అఘాయిత్యాలకు పాల్పడతారో.. ఈ హజారాల మరణశిక్షలే నిదర్శనమని అన్నారు.

ఇదీ చూడండి: Afghan Taliban: తాలిబన్ల పాలనలో మీడియాపై ఉక్కుపాదం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.