ETV Bharat / international

కరోనాను గెలిచిన దేశాల్లో మళ్లీ కలవరం

దక్షిణ కొరియా, జర్మనీ... కరోనాపై పోరులో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన దేశాలు. కానీ... ఇప్పుడు పరిస్థితి మారింది. ఆ దేశాల్లోనూ కరోనా కేసులు క్రమంగా పెరగడం ప్రజల్ని కలవరపెడుతోంది. ఎందుకీ మార్పు? ఆంక్షల సడలింపు వల్లే వైరస్​ మళ్లీ విజృంభిస్తుందా? ఇతర దేశాల పరిస్థితి ఏంటి?

author img

By

Published : May 10, 2020, 1:17 PM IST

S. Korea
'కరోనా కొత్త కేసులు పెరుగుతున్నా.. భయమేమీ లేదు'

కొవిడ్​-19 విజృంభణతో స్తంభించిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు వివిధ దేశాలు లాక్​డౌన్​ ఆంక్షలను ఎత్తివేస్తున్నాయి. వ్యాపార సముదాయాలు, దుకాణాలు తెరుచుకుంటున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. అయితే.. ఆంక్షల సడలింపుతో కొత్తగా వైరస్​ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికా, జర్మనీ, ఇటలీ సహా పలు దేశాల్లో కొత్త కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది.

వైరస్​ను కట్టడి చేయటంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన దక్షిణ కొరియాలోనూ కొత్త కేసులు పెరిగాయి. ఈ నేపథ్యంలో శనివారం (మే9న) 2,100కుపైగా బార్లు, డిస్కోలు, నైట్​ క్లబ్​లను మూసివేసింది అక్కడి ప్రభుత్వం. వీటికి సంబంధం ఉన్న వ్యక్తి కారణంగానే వైరస్​ వ్యాప్తి చెందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. కొత్త కేసులు పెరుగుతున్నప్పటికీ భయపడాల్సిన పని లేదని భరోసా కల్పించారు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్​ జే-ఇన్​. ప్రజలు జాగ్రత్తగా ఉంటూ.. రక్షణ చర్యలు తప్పక పాటించాలని కోరారు.

కరోనా మహమ్మారిని కట్టడి చేయటం ఎలాగో ప్రభుత్వానికి తెలుసని.. సరైన క్వారంటైన్​ సదుపాయాలు, వైద్య వ్యవస్థతో వైరస్​ను ఎదుర్కోగల అనుభవం ఉందని పేర్కొన్నారు మూన్​. గడిచిన 24 గంటల్లో కొరియాలో 34 కొత్త కేసులు నమోదైన నేపథ్యంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు.

దక్షిణ కొరియాలో ఇప్పటి వరకు మొత్తం 10,874 కేసులు నమోదయ్యాయి. 256 మంది ప్రాణాలు కోల్పోగా 9,610 మంది కోలుకున్నారు. మరో 10,128 మందికి చేసిన పరీక్ష ఫలితాలు వెలువడాల్సి ఉంది.

జర్మనీలో..

జర్మనీ, దక్షిణ కొరియా విస్తృతంగా పరీక్షలు చేయటం, కేసులు గుర్తించి చికిత్స అందించటంలో ముందున్నాయి. ఇతర దేశాల తరహాలో భారీగా మరణాలు సంభవించకుండా చేసినందుకు ప్రశంసలు అందుకున్నాయి. కానీ.. అక్కడ కూడా ప్రజల ప్రాణాలు రక్షించటం, ఉద్యోగాలను కాపాడటం మధ్య సమతుల్యం పాటించలేకపోతున్నారు అధికారులు.

జర్మనీలో మూడు కబేళ కేంద్రాల్లో ఇటీవల భారీగా కేసులు బయటపడ్డాయి. కోస్​ఫీల్డ్​లోని ఓ కేంద్రంలో 180 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్​గా తేలటం అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది.

అమెరికాలో..

అమెరికాలో కరోనాకు హాట్​స్పాట్ అయిన​ న్యూయార్క్​ సహా ఇతర రాష్ట్రాల్లో ఆంక్షలు సడలించటం వల్ల కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వ్యాపార సముదాయాలు, రెస్టారెంట్లు, దుకాణాలు తెరుచుకోవటం వల్ల ప్రజలు భారీగా వీధుల్లోకి వస్తున్నారు.

అత్యంత భద్రత కలిగిన శ్వేతసౌధానికి కరోనా ముప్పు తప్పటం లేదు. ఇప్పటికే పలువురికి కరోనా పాజిటివ్​గా తేలగా.. తాజాగా కరోనా టాస్క్​ఫోర్స్​లోని ఇద్దరు శ్వేతసౌధం సభ్యులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లటం అక్కడ కలకలం రేపింది.

బెలారస్​..

ఐరోపాలోని బెలారస్​లో కేసులు పెరుగుతున్నప్పటికీ లాక్​డౌన్​ విధించలేదు. ఈ కారణంగా 1945లో నాజీ జర్మనీపై యుద్ధంలో గెలిచిన సందర్భంగా నిర్వహించే విజయోత్సవానికి వేలాదిమంది హాజరయ్యారు. అయితే... పెద్ద ఎత్తున ప్రజలు హాజరవటం వల్ల వైరస్​ వ్యాప్తి చెందుతుందన్న ఆందోళనలను తోసిపుచ్చారు అధ్యక్షుడు అలెక్జాండర్​ లుకషెంకో. అది ఒక మానసిక భావనగా పేర్కొన్నారు.

రష్యాలో..

రష్యాలో కరోనా విజృంభణ దృష్ట్యా ఈ ఏడాది మాస్కోలోని రెడ్​ స్వ్కేర్​లో నిర్వహించాల్సిన గ్రాండ్​ మిలిటరీ పరేడ్​ను రద్దు చేసింది ప్రభుత్వం. రెండో ప్రపంచ యుద్ధం ఏడాది 75వ వార్షికోత్సవానికి వేలాది మంది హాజరవుతారని ఊహించినప్పటికీ.. జనం లేకుండానే సైనికుల స్మారక స్థూపం వద్ద అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. సైనికులు కూడా చాలా కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.