రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చైనాలోని ఫ్యూజియాన్ రాష్ట్రం జలమయం అయింది. 100 మిల్లీమీటర్ల మేర కురిసిన వర్షపాతంతో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల ఆనకట్టలు ధ్వంసం కావటం వల్ల రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామాలు నీట మునిగాయి.
కొన్ని చోట్ల వరద నీరు సుమారు రెండు మీటర్ల ఎత్తులో ప్రవహించిందని అధికారులు చెబుతున్నారు. సమాచార, విద్యుత్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరద ఉద్ధృతికి 200 ఇళ్లు సహా 7 వంతెనలు నేలమట్టం అయ్యాయి. మరో 20 వంతెనలు ధ్వంసం అయ్యాయి. వీధులన్నీ బురదతో నిండిపోయాయి.
వీధుల్లో పడవలు
ముందస్తు చర్యల్లో భాగంగా సుమారు 16వేల 500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. షున్చాంగ్, యాంగ్డూన్, రెన్షౌ పట్టణాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. బాధితులకు సాయం అందించేందుకు పడవలను ఉపయోగిస్తున్నారు అధికారులు.
ఇదీ చూడండి: చైనా వాల్ 2.0: మహా కుడ్యానికి మరమ్మతులు