జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారుస్తూ.. భారత్ తీసుకున్న నిర్ణయాన్ని తిరస్కరించాలని ఐరాస భద్రతా మండలిని ఆశ్రయించారు పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌కు లేఖ రాశారు.
ఇదే ఏడాది ఆగస్టు 1,6,13, 26, సెప్టెంబర్ 16వ తేదీల్లో రాసిన ఉత్తరాలకు ఈ లేఖను కొనసాగింపుగా పేర్కొన్న ఆయన.. కశ్మీర్లో తాజా పరిస్థితులపైనా ఐరాసకు నివేదించారు. చట్ట విరుద్ధ విభజనతో భారత్-పాక్ సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులను మరింత పెరిగాయని తెలిపారు. ఇరుదేశాల్లోనూ ఐరాసకు చెందిన సైనిక పర్యవేక్షణ బృందాలను మరింత బలోపేతం చేయాలని లేఖలో పేర్కొన్నారు ఖురేషి.
ఇదీ చూడండి: ఉమ్మడి పౌరస్మృతిపై ముందుకేనా?