భారత పైలెట్ అభినందన్ వర్ధమాన్‌ను ఎలాంటి ఒత్తిళ్లు, బలవంతం చేత అప్పగించలేదని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీ వెల్లడించారు. ఐఏఎఫ్ వింగ్ కమాండర్ భారత్‌కు తిరిగి వచ్చిన మరుసటి రోజే ఈ వ్యాఖ్యలు చేశారు ఖురేషీ.
పుల్వామా ఉగ్రదాడితో ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగేలా, భారత పైలెట్‌ను అప్పగించడానికి అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా నుంచి పాక్ ఒత్తిడిని ఎదుర్కొంది.
" మీకు (భారత్‌కు) బాధలు పెంచాలనుకోవట్లేదు. మీ పౌరులు దుఃఖించాలని అనుకోవట్లేదు. మేము శాంతి కోరుకుంటున్నాం. అభినందన్‌ను విడుదల చేయటానికి పాకిస్థాన్‌పై ఎలాంటి బలవంతం, ఒత్తిడి లేదు. " - మహమూద్ ఖురేషీ, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి
జైషే మహమ్మద్ ఉగ్రసంస్థకు వ్యతిరేకంగా ఆధారాలు అందిస్తే చర్యలు చేపడతామని ఖురేషీ పునరుద్ఘాటించారు.