ETV Bharat / international

మెల్​బోర్న్​లో క్వాడ్​ దేశాల సమావేశం- చైనా అక్కసు - క్వాడ్ సమావేశం

Quad news: ఇండో పసిఫిక్​లో స్వేచ్ఛాయుత వాతావరణం, శాంతి, స్థిరత్వమే లక్ష్యమని క్వాడ్ దేశాలు పునరుద్ఘాటించాయి. మెల్​బోర్న్​లో సమాశమైన క్వాడ్​ దేశాల విదేశాంగ మంత్రులు ఈ మేరకు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. మరోవైపు చైనా మాత్రం ఎప్పటిలాగే అక్కసు వెళ్లగక్కింది.

క్వాడ్ మీటింగ్​
Quad meeting
author img

By

Published : Feb 11, 2022, 8:07 PM IST

Quad foreign ministers meet: క్వాడ్ దేశాలైన భారత్​, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా విదేశాంగ మంత్రులు మెల్​బోర్న్​లో సమావేశమయ్యారు. స్వేచ్ఛ, సమ్మిళిత ఇండో-ఫసిపిక్​ సహా ఉగ్రవాదం వంటి ముప్పులను ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ భేటీలో భారత విదేశాంగ మంత్రి ఎస్​ జైశంకర్​, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్​, జపాన్ విదేశాంగ మంత్రి యోశిమాస హయాశి, ఆస్ట్రేలియా విదేశాంగమంత్రి మేరిస్​ పేన్ పాల్గొన్నారు. భేటీ అనంతరం క్వాడ్ దేశాల ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.

భేటీ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన మేరిస్​ పేన్​ చైనాకు పరోక్ష సందేశం పంపారు. స్వేచ్ఛా విలువలు, జాతీయ సార్వభౌమాధికారాన్ని కాపాడటం, నిబంధనలు సరిగ్గా పాటించేలా చూసేందుకు క్వాడ్ దేశాలు పనిచేస్తాయని పునరుద్ఘాటించారు.

భారత విదేశాంగ మంత్రి ఎస్​ జైశంకర్ మాట్లాడుతూ.. క్వాడ్ దేశాల మధ్య దృఢమైన ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక కలయికలు, భాగస్వామ్య ప్రజాస్వామ్య విలువలు అన్నీ కలిసి క్వాడ్‌ను శక్తివంతమైన, గణనీయమైన ఫ్రేమ్‌వర్క్‌గా మార్చాయని చెప్పారు. స్వేచ్ఛాయుత, సమ్మిళిత ఇండో-పసిఫిక్ విజన్​ను ముందుకు తీసుకెళ్లడానికి ఒక ఎజెండాను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్‌లో మరింత శాంతి, స్థిరత్వం, ఆర్థిక శ్రేయస్సు కోసం కలిసి పనిచేయడానికి క్వాడ్ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

చైనా అక్కసు..

క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంపై చైనా అక్కసు వెళ్లగక్కింది. తమను నియంత్రించాలనే ఏకైక లక్ష్యంతోనే ఈ కూటమి ఏర్పాటైందని వ్యాఖ్యానించింది. దీన్ని ఓ సాధనంగా అభివర్ణించింది. ఉద్రిక్తతలు మరింత పెంచాలని చూస్తున్నారని, కానీ విఫలమయ్యారని చైనా విదేశాంగ మంత్రి జావ్​ లిజియాన్ అన్నారు.

ఇదీ చదవండి: 'ఉక్రెయిన్ నుంచి వచ్చేయండి.. సైన్యాన్ని పంపిస్తే ప్రపంచ యుద్ధమే!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.