ETV Bharat / international

'కరోనా నియంత్రణలో అంతర్జాతీయ సహకారం తప్పనిసరి' - భారత ప్రధాని నరేంద్ర మోదీ

కరోనాను ఎదుర్కొనేందుకు వ్లాదిమిర్​ పుతిన్​ నేతృత్వంలో రష్యా చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఇవాళ జరగనున్న జీ-20 వర్చువల్​ సమ్మిట్​ నేపథ్యంలో పుతిన్​తో ఫోన్​లో సంభాషించారు మోదీ. కొవిడ్​ నియంత్రణపై ఇరువురూ అభిప్రాయాలను పంచుకున్నారు.

Putin, Modi exchange views on situation surrounding coronavirus pandemic
'కరోనా నియంత్రణలో అంతర్జాతీయ సహకారం తప్పనిసరి'
author img

By

Published : Mar 26, 2020, 5:43 AM IST

జీ-20 అత్యవసర శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​తో ఫోన్​లో సంభాషించారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో.. వైరస్​ను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురూ చర్చించారు.

ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని పరిష్కరించటంలో అంతర్జాతీయ సహకారం తప్పనిసరి అని పేర్కొన్నారు మోదీ, పుతిన్​. ఈ సందర్భంగా ప్రపంచదేశాల ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం దిశగా కృషి చేయాలని నిర్ణయించారు.

వారు త్వరగా కోలుకోవాలి..

కరోనాపై చర్చించేందుకు జీ-20 సమావేశం ఒక చక్కని వేదిక అని, సదస్సు కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు మోదీ. రష్యాలో కొవిడ్​ బారిన పడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

కరోనాపై పోరాడేందుకు పుతిన్​ నేతృత్వంలో ఆ దేశం చేస్తోన్న ప్రయత్నాలు సఫలం అవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కొవిడ్​-19ను ఎదుర్కొనేందుకు భారత్​ తీసుకున్న చర్యల పట్ల పుతిన్​ సంతృప్తి వ్యక్తం చేశారు.

వీసీలో జీ-20

భారత్​తో సహా ప్రపంచదేశాలను అతలాకుతలం చేస్తోన్న కరోనా వైరస్ నియంత్రణపై చర్చించేందుకు నేడు జీ-20 దేశాల అధినేతలు సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించే సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొననున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.