ETV Bharat / international

బైడెన్​కు శుభాకాంక్షలు తెలిపిన పుతిన్ - Russian President Vladimir Putin

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​కు శుభాకాంక్షలు తెలిపారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​. ఇరు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం అగ్రరాజ్యంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని క్రెమ్లిన్​ తెలిపింది.

Putin congratulates Biden on US election victory
బైడెన్​కు శుభాకాంక్షలు తెలిపిన పుతిన్
author img

By

Published : Dec 15, 2020, 4:25 PM IST

అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్​ను ఎలక్టోరల్ కాలేజీ అధికారంగా ఎన్నుకున్న నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​. బైడెన్​ గెలుపు అందరి విజయంగా అభివర్ణించిన క్రెమ్లిన్.. ప్రపంచ భద్రత, స్థిరత్వం సహా ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లపై పోరుకు ఇరు దేశాలు కలిసి పని చేయాలని బైడెన్​కు పంపిన సందేశంలో పేర్కొంది.

"పరస్పర గౌరవం, సమానత్వం సిద్ధాంతాలకు అనుగుణంగా.. ఇరుదేశాల ప్రజల ప్రయోజనాల కోసం అమెరికా, రష్యాలు సహకారం అందించుకుంటాయి. అమెరికాతో కలిసి పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను." అంటూ క్రెమ్లిన్​ ద్వారా తన సందేశాన్ని పంపారు పుతిన్​.

బైడెన్​ అధికారికంగా ఎన్నికైనంత వరకు అభినందించకూడదని క్రెమ్లిన్​ గతంలో నిర్ణయించుకుంది. అయితే అమెరికా ఎలక్టోరల్ కాలేజీ ఎన్నిక తర్వాత బైడెన్​ విజయాన్ని గుర్తించింది రష్యా.

తదుపరి అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్​, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్​ను ఎలక్టోరల్​ కాలేజీ అధికారికంగా ఎన్నుకుంది. దీంతో అధ్యక్షుడు ట్రంప్​ చేసిన న్యాయ పోరాటం ఇక ముగిసినట్లు అయ్యింది.

ఇదీ చూడండి: ముగిసిన ట్రంప్​ పోరు- అధ్యక్షుడిగా బైడెన్​ ధ్రువీకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.