భూటాన్లోని పారో అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని నరేంద్రమోదీ చేరుకున్నారు. రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక మొదటి సారి విదేశీ పర్యటనకు వెళ్లిన మోదీకి ఆతిథ్య దేశ ప్రధాని లొటాయ్ షేరింగ్ ఘన స్వాగతం పలికారు.
ప్రధాని ఇవాళ, రేపు భూటాన్లో పర్యటిస్తారు. ఆ దేశ రాజు జిగ్మే ఖేసర్ వాంగ్ చుక్, ప్రధానితో సమావేశమవుతారు. వ్యూహాత్మక భాగస్వామ్యులైన భారత్-భూటాన్... ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే దిశగా చర్చించనున్నట్లు విదేశాంగశాఖ తెలిపింది. ప్రధాని పర్యటన... నమ్మకమైన మిత్రదేశంతో సంబంధాలకు భారత్ ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనమని పేర్కొంది.
ఇదీ చూడండి: మహాత్ముడు మెచ్చిన పల్లె... ఎందుకంత ప్రత్యేకం?