ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన అఫ్గానిస్థాన్ నుంచి బయటపడేందుకు అక్కడి పౌరులు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. కిక్కిరిసిపోయిన విమానాల్లో ప్రయాణించేందుకు ఎగబడుతున్నారు. కొందరు విమాన పైభాగాన ఎక్కి ప్రయాణించి.. ప్రాణాలు కోల్పోయారు. ఇలా.. ఏదో విధంగా దేశం దాటి వెళ్లాలని యత్నిస్తున్నారు. కానీ అఫ్గాన్‌లోని ఓ హిందూ పురోహితుడు మాత్రం దేశం విడిచి వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. అఫ్గాన్ వదిలి వెళ్లే అవకాశం వచ్చినా.. తిరస్కరించారు.
పండిత్ రాజేశ్ కుమార్ అనే వ్యక్తి కాబుల్‌లోని రతన్ నాథ్ మందిరంలో పూజారిగా సేవలందిస్తున్నారు. వందల ఏళ్ల నుంచి తన పూర్వీకులు ఈ మందిరాన్ని సంరక్షిస్తూ వచ్చారని, అలాంటి గుడిని ఇప్పుడు విడిచిపెట్టలేనని అంటున్నారు. ఒకవేళ తాలిబన్లు తనను చంపేసినా.. దాన్ని సేవగా భావిస్తానని చెప్పారు.
గుడికి వచ్చే చాలా మంది హిందువులు, భక్తులు తమతో పాటు వచ్చేయాలని కోరినట్లు రాజేశ్ తెలిపారు. కానీ, అందుకు తాను నిరాకరించానని వెల్లడించారు.
ఈయన గురించి వీడియోను ఓ నెటిజన్ ట్విట్టర్లో షేర్ చేయగా.. అనేక మంది రాజేశ్‌ను మెచ్చుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో ఆయన చూపిస్తున్న విధేయత, దైవభక్తి పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
-
Pandit Rajesh Kumar, the priest of Rattan Nath Temple in Kabul:
— Bharadwaj (@BharadwajSpeaks) August 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
"Some Hindus have urged me to leave Kabul & offered to arrange for my travel and stay.
But my ancestors served this Mandir for hundreds of years. I will not abandon it. If Taliban kiIIs me, I consider it my Seva"
">Pandit Rajesh Kumar, the priest of Rattan Nath Temple in Kabul:
— Bharadwaj (@BharadwajSpeaks) August 15, 2021
"Some Hindus have urged me to leave Kabul & offered to arrange for my travel and stay.
But my ancestors served this Mandir for hundreds of years. I will not abandon it. If Taliban kiIIs me, I consider it my Seva"Pandit Rajesh Kumar, the priest of Rattan Nath Temple in Kabul:
— Bharadwaj (@BharadwajSpeaks) August 15, 2021
"Some Hindus have urged me to leave Kabul & offered to arrange for my travel and stay.
But my ancestors served this Mandir for hundreds of years. I will not abandon it. If Taliban kiIIs me, I consider it my Seva"
ఇవీ చదవండి:
'ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రకటిస్తున్నాం'
తాలిబన్లు మంచిగా మారిపోయారా? ఆ ప్రకటనల ఆంతర్యమేంటి?
భారత్ కానుక తాలిబన్ల వశం.. పార్కులనూ వదల్లేదు!