టిబెట్-చైనాల మధ్య నిర్మించనున్న సిచువాన్-టిబెట్ రైల్వే మార్గం భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌ను ఆనుకొని వెళ్తోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రాజెక్టు నిర్మాణ కార్యక్రమాన్ని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రారంభించారు. ఈ మార్గం ద్వారా టిబెట్ ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో సుస్థిరతను కాపాడటంలో ఈ మార్గం కీలకం కానుందని తెలిపారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
రైల్వే మార్గం ఇదే
సిచువాన్-టిబెట్ రైల్వే మార్గం చైనాలోని చెంగ్దూ ప్రాంతంలో ప్రారంభమై యాన్, క్వాముదో మీదుగా టిబెట్‌కు చేరుకుంటుంది. ప్రయాణ దూరం 1,011 కిలోమీటర్లు. ఈ మార్గం ద్వారా ఇరు దేశాల మధ్య ప్రయాణ సమయం 48గంటల నుంచి 13గంటలకు తగ్గనుంది. దీని నిర్మాణానికి అయ్యే ఖర్చు 3.50లక్షల కోట్లు.