ETV Bharat / international

'పేదరికంపై చైనా సంపూర్ణ విజయం!'

తమ దేశంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించినట్లు చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్ ప్రకటించారు. గత నాలుగు దశాబ్దాలలో 77 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చినట్లు చెప్పారు. ప్రపంచం పేదరిక నిర్మూలనలో 70 శాతానికి పైగా వాటా చైనాదేనని వెల్లడించారు.

President Xi declares complete victory in eradicating poverty in China
జిన్​పింగ్
author img

By

Published : Feb 25, 2021, 12:08 PM IST

పేదరికాన్ని చైనా విజయవంతంగా అధిగమించిందని ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్​పింగ్ ప్రకటించారు. గత నాలుగు దశాబ్దాలలో 77 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చినట్లు తెలిపారు. దేశం సాధించిన అద్భుతాల్లో ఇది ఒకటని, ఈ సంపూర్ణ విజయం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. పేదరిక నిర్మూలన అంశంపై బీజింగ్​లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు జిన్​పింగ్.

"ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాం. 'చైనా పేదరిక రేఖ' సూచీని బట్టి చూస్తే 1970ల్లో సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాతి నుంచి 77 కోట్ల మంది గ్రామీణ ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం. ఫలితంగా.. 2030లోపు పేదరిక నిర్మూలన సాధించాలన్న ఐరాస లక్ష్యాన్ని పదేళ్ల ముందుగానే సాధించాం."

-జిన్​పింగ్, చైనా అధ్యక్షుడు

గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న 9 కోట్ల 89 లక్షల మంది పేదలను గత ఎనిమిదేళ్లలో దారిద్ర్య రేఖ ఎగువకు తీసుకొచ్చినట్లు వివరించారు జిన్​పింగ్. పేదరిక జాబితాలో ఉన్న 832 కౌంటీలు, లక్షా 28 వేల గ్రామాలను అందులో నుంచి తొలగించినట్లు చెప్పారు. తాను అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత 1.6 ట్రిలియన్ యువాన్ల(సుమారు రూ.18 లక్షల కోట్లు)ను పేదరిక నిర్మూలనపై వెచ్చించినట్లు తెలిపారు. గత నాలుగు దశాబ్దాల కాలంలో ప్రపంచ పేదరిక నిర్మూలనలో చైనా వాటా 70 శాతానికి పైగా ఉందని అన్నారు. 28 జాతిపరమైన మైనారిటీ సమూహాలను పేదరికం నుంచి వెలికితీసినట్లు చెప్పారు.

పేదరిక నిర్మూలనతో అంతా పూర్తైనట్టు కాదని.. కొత్త ప్రయత్నాలు, కొత్త జీవితాలు ప్రారంభించడానికి ఇది నాంది అని అన్నారు జిన్​పింగ్.

2012లో అధికారంలోకి వచ్చిన జిన్​పింగ్.. పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడమే తన ప్రధాన లక్ష్యమని అప్పట్లో ప్రకటించారు. అప్పుడు దేశంలో 10 కోట్ల మంది పేదలు ఉన్నట్లు అంచనా.

ఇవీ చదవండి:

జిన్‌పింగ్ వ్యూహం- ఏకచ్ఛత్రాధిపత్యమే ధ్యేయం ‌

జిన్​పింగ్​ పార్టీలో అసమ్మతికి నో ప్లేస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.