హెచ్-1బీ సహా ఇతర నాన్ ఇమిగ్రెంట్ వీసాల జారీపై డొనాల్డ్ ట్రంప్ విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని సూచిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు పలువురు సెనేటర్లు లేఖ రాశారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికా కంపెనీలకు, విదేశీ నిపుణులకు, వారి కుటుంబాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు వివరించారు.
ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల కొరతను భర్తీ చేసేందుకు.. వెంటనే విదేశీ టెకీలను నియమించుకునేలా వీలు కల్పించాలని బైడెన్‌కు సూచించారు సెనేటర్లు. ఈ ప్రక్రియ ఇంకా ఆలస్యమైతే ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
గత ఏడాది జూన్‌లో.. నాన్ ఇమిగ్రెంట్ వీసాలైన హెచ్-1బీ, ఎల్-1, హెచ్-2బీ, జే-1 వీసాల జారీపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు అప్పటి అధ్యక్షుడు ట్రంప్. తొలుత 2020 డిసెంబర్ 31వరకు విధించిన ఈ నిషేధం.. చివరిసారిగా 2021 మార్చి 31 వరకు పొడిగించారు.
ఇదీ చదవండి:గ్రీన్‌కార్డులు ఇవ్వాలని భారతీయులు ధర్నా