ETV Bharat / international

జపాన్​ను వణికిస్తున్న ఫక్సాయ్​ తుపాను

రికార్డు స్థాయిలో గంటకు 216 కి.మీ వేగంతో వీస్తున్న గాలులతో జపాన్ రాజధాని టోక్యోను ఫక్సాయ్ తుపాను అతలాకుతలం చేస్తోంది. పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. విద్యుత్​ సేవలకు అంతరాయం కలిగింది. తుపాను తీవ్రత దృష్ట్యా పలు రైలు, విమాన సర్వీసులను నిలిపివేశారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు.

జపాన్​ను వణికిస్తున్న ఫక్సాయ్​ తుపాను
author img

By

Published : Sep 9, 2019, 9:43 AM IST

Updated : Sep 29, 2019, 11:11 PM IST

జపాన్​ను వణికిస్తున్న ఫక్సాయ్​ తుపాను

జపాన్​ రాజధాని టోక్యోను శక్తిమంతమైన ఫక్సాయ్​ తుపాను అతలాకుతలం చేసింది. భీకర గాలులు, వర్షాల వల్ల రాజధాని ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. 2,90,000 గృహాలకు విద్యుత్ నిలిచిపోయింది. రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు, విమానసేవలు నిలిపివేశారు.

పరిస్థితి తీవ్రత దృష్ట్యా తీర ప్రాంతంలోని సుమారు 5 వేల మందిని ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేసింది. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపింది.

తీవ్రమయ్యే అవకాశం

తుపాను మరింత తీవ్ర రూపు దాల్చే అవకాశముందని జపాన్ వాతావరణశాఖ హెచ్చరించింది. భారీ ఈదురుగాలులు, వర్షాలు, వరదలు రావొచ్చని, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

షిజువాలో సుమారు 10 ఇళ్లు దెబ్బతిన్నాయి. గాలుల దాటికి కార్లు పల్టీలు కొట్టినట్లు స్థానిక మీడియా తెలిపింది.

క్రీడలకు అంతరాయం..

జపాన్​లో ఈ నెల రగ్బీ వరల్డ్​ కప్​ జరగనుంది. తుపాను కారణంగా దానిపై ప్రభావం పడొచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి: శునకాలను చంపి.. రోడ్లపై కుప్పలుగా విసిరేశారు

Ladakh, Sep 09 (ANI): The 8th edition of Ladakh Marathon concluded on September 08, in Leh. It witnessed 5500 participants from 26 countries. The 8th edition of Ladakh Marathon was divided in two days event with world highest Marathon Khardongla Challenge (72Km) held on September 06, followed by events held in three categories of Full Marathon (42Km), Half Marathon (21Km) and Run of fun (7KM). It is the highest marathon in the world as it is held at over 11, 000 feet above the mean sea level.
Last Updated : Sep 29, 2019, 11:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.