ETV Bharat / international

Power outages: మధ్య ఆసియా దేశాల్లో కరెంటు కష్టాలు - మధ్య ఆసియా దేశాల్లో విద్యుత్​ అంతరాయం

మధ్య ఆసియా దేశాలను కరెంట్​ సమస్యలు వేధిస్తున్నాయి. కజికిస్థాన్​, కిర్గిస్థాన్​, ఉజ్బెకిస్థాన్​లో మంగళవారం భారీగా విద్యుత్ సరఫరాకు ​ అంతరాయం ఏర్పడింది. ఫలితంగా లక్షలాది మంది ప్రజలు అంధకారంలోకి వెళ్లారు. కరెంటు లేక అవస్థలు పడ్డారు.

Power outages
Power outages
author img

By

Published : Jan 25, 2022, 5:39 PM IST

Updated : Jan 25, 2022, 5:58 PM IST

Power outages: మధ్య ఆసియా దేశాలైన కజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్‌, కిర్గిస్థాన్‌లలో మంగళవారం విద్యుత్ సరఫరాలో తీవ్ర​ అంతరాయం ఏర్పడింది. ఫలితంగా లక్షలాది మంది ప్రజలు అంధకారంలోకి వెళ్లారు. కజికిస్థాన్​లోని అతిపెద్ద నగరం ఆల్మటీలో 20 లక్షల మందికి కరెెంట్​ సరఫరా నిలిచిపోయినట్లు స్థానిక మీడియా పేర్కొంది. తుర్కిస్థాన్​ దక్షిణ ప్రాంతంలోని షైమ్‌కెంట్, జంబిల్​లోని పలు ప్రాంతాల్లో కరెంటు లేక ప్రజలు అవస్థలు పడినట్లు తెలిపింది.

కిర్గిస్థాన్‌ రాజధాని బిష్కెక్, ఉత్తర చుయ్ ప్రాంతాలకు కూడా విద్యుత్​ సరఫరా నిలిచిపోయినట్లు ఆ దేశ మంత్రి తెలిపినట్లు మీడియా పేర్కొంది.

ఉజ్బెకిస్థాన్​లో విద్యుత్​ అంతరాయం వల్ల రాజధాని నగరం తాష్కెంట్‌లో సబ్‌వే నిలిచిపోయింది. తాష్కెంట్​ విమానాశ్రయ అధికారులు విమానాల రాకపోకలను నిలిపివేశారు. అయితే భారీ స్థాయిలో విద్యుత్​ సరఫరా అంతరాయానికి కారణమేంటన్నది తెలియరాలేదు.

కజికిస్థాన్‌లో విద్యుత్​ లైన్​ విఫలమైందని ఉజ్బెక్ అధికారులు చెప్పినట్లు స్థానిక మీడియా చెబుతోంది.

ఈ మూడు దేశాలు ఒకప్పుడు సోవియట్​ యూనియన్​లో అంతర్భాగం ఉండేవి. అప్పట్లో రూపొందించిన ఒకే విద్యుత్​ వ్యవస్థలోనే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఫలితంగా మూడు దేశాల్లో ఒకేసారి విద్యుత్​ ఇబ్బందులు తలెత్తినట్లు అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: సూపర్​మార్కెట్​లో పిల్లాడ్ని 'కొనేందుకు' మహిళ యత్నం- 10ఏళ్లు జైలు!

Last Updated : Jan 25, 2022, 5:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.