జపాన్‌లోని ఒసాకాలో జరిగిన 14వ జీ-20 దేశాల సదస్సు ముగిసింది. సమావేశానికి హాజరైన ప్రధాని నరేంద్రమోదీ భారత్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. జపాన్‌లో 3 రోజుల పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా అనేక దేశాల అధినేతలతో భేటీ అయ్యారు. ఇప్పటి వరకు 6 జీ-20 సదస్సులకు హాజరయ్యారు మోదీ.
-
More than 20 engagements in three days!
— Raveesh Kumar (@MEAIndia) June 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
PM @narendramodi concludes his 3-day high-energy diplomacy to Osaka. Attended the #G20 Summit, along with 9 Bilaterals, 8 pull-aside meetings, 2 plurilaterals, 1 multilateral on the margins the #G20 Summit. pic.twitter.com/Y9PDU9Njns
">More than 20 engagements in three days!
— Raveesh Kumar (@MEAIndia) June 29, 2019
PM @narendramodi concludes his 3-day high-energy diplomacy to Osaka. Attended the #G20 Summit, along with 9 Bilaterals, 8 pull-aside meetings, 2 plurilaterals, 1 multilateral on the margins the #G20 Summit. pic.twitter.com/Y9PDU9NjnsMore than 20 engagements in three days!
— Raveesh Kumar (@MEAIndia) June 29, 2019
PM @narendramodi concludes his 3-day high-energy diplomacy to Osaka. Attended the #G20 Summit, along with 9 Bilaterals, 8 pull-aside meetings, 2 plurilaterals, 1 multilateral on the margins the #G20 Summit. pic.twitter.com/Y9PDU9Njns
భేటీల పర్వం
జపాన్‌కు గురువారం చేరుకున్న మోదీ.. మొదటగా జపాన్ ప్రధాని షింజో అబేతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థులు, విపత్తు నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జపాన్ చక్రవర్తి 'నరుహితో' పట్టాభిషేకానికి భారత రాష్ట్రపతి హాజరవుతారని ప్రకటించారు మోదీ.
శుక్రవారం ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ రోజూ వరుస భేటీలతో తీరిక లేకుండా గడిపారు మోదీ. ఇండోనేసియా, బ్రెజిల్, టర్కీ, ఆస్ట్రేలియా దేశాధినేతలతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.
విపత్తు నిర్వహణకు పిలుపు
ప్రకృతి విపత్తుల నుంచి ఉపశమనం పొందేందుకు దేశాలన్నీ కూటమిగా ఏర్పడాలని మోదీ పిలుపునిచ్చారు. విపత్తు ప్రభావిత ప్రాంతాలను, ప్రజలను త్వరగా కోలుకునేలా అన్ని దేశాల్లో ఏర్పాట్లు జరగాలని ఆకాంక్షించారు.
ఇదీ చూడండి: జీ-20 సదస్సు: సభ్య దేశాలతో మోదీ భేటీ