ETV Bharat / international

జర్మనీలో కూలిన విమానం- ముగ్గురు మృతి

జర్మనీలో ఓ విమానం కూప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఘటనలో ఉక్రెయిన్​లో జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు మృతి చెందారు. రెండు ఘటనల్లోనూ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు.

plane crash
విమాన ప్రమాదం
author img

By

Published : Jul 17, 2021, 10:20 PM IST

జర్మనీలో జరిగిన విమాన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. స్టుట్​గర్ట్​ ఎయిర్​ పోర్టు నుంచి బయలుదేరిన విమానం.. గాల్లోకి ఎగిరిన 20 నిమిషాలకే కుప్పకూలింది. తూర్పు జర్మనీలోని మగ్డేబర్గ్​కు బయలుదేరిన ఈ విమానంలో ముగ్గురు ఉన్నారు.

విమాన ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. రాడార్​ నుంచి కనుమరుగవుతున్న క్షణంలో పైలెట్​ ఎమర్జెన్సీ కాల్​ చేయలేదని ఎయిర్​పోర్టు అధికారులు తెలిపారు. అయితే.. ప్రమాద సమీపంలో విమానం రికార్డర్​ దొరికిందని వివరించారు.

ఉక్రెయిన్​లోనూ..

ఉక్రెయిన్​లోనూ ఓ హెలికాప్టర్​​ శనివారం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు మృతి చెందారని అధికారులు తెలిపారు. ఉక్రెయిన్​ రాజధాని కీవ్​కు సుమారు 450 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.

వ్యవసాయ రసాయనాలను పిచికారి చేస్తున్న ఈ హెలికాప్టర్​​కి గాల్లోనే మంటలు అంటుకున్నాయి. అనంతరం భూమిపై కుప్పకూలింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని అధికారులు వివరించారు.

ఇదీ చదవండి: భారత సంతతి ప్రజలే లక్ష్యంగా దాడులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.