ఓ ప్రయాణికురాలు పొరపాటున టాయిలెట్ అనుకొని అత్యవసర ద్వారం తెరవగా... పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని అర్ధంతరంగా ఆపేశారు. ఏడు గంటల నిరీక్షణ తరువాత విమానం బయలుదేరింది.
40 మంది ప్రయాణికులతో 'పీఐఏ'కు చెందిన పీకే 702 విమానం... మాంచెస్టర్ విమానాశ్రయం నుంచి పాకిస్థాన్ బయలుదేరేందుకు సిద్ధమైంది. విమానం రన్‌వేపై ఉన్న సమయంలో ఓ ప్రయాణికురాలు పొరపాటున టాయిలెట్ అనుకొని అత్యవసర ద్వారం తెరిచింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని నిలిపివేశారు. ప్రయాణికులను వారి సామానులతో సహా దింపేశారు. వారిని మరొక విమానంలో గమ్యస్థానానికి పంపారు.
పీకే 702 విమానం ఏడు గంటల తరువాత పాకిస్థాన్ బయలుదేరింది. ఘటనపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.
ఇదీ చూడండి: 'ఆ రాష్ట్రాలపై ప్రధానిది సవతి తల్లి ప్రేమ'