ETV Bharat / international

ఫిలిప్పీన్స్​లో 'వామ్కో' బీభత్సం- 53కు చేరిన మృతులు

ఫిలిప్పీన్స్​ను 'వామ్కో' తుపాను వణికిస్తోంది. తుపాను సృష్టించిన బీభత్సానికి ఇప్పటివరకు 53మంది బలయ్యారు. మరో 22మంది గల్లంతయ్యారు. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. ముంపు ప్రాంతాలవారిని సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు.

Philippines: Typhoon Vamco leaves 53 dead, 22 missing in the flash floods and landslides triggered
ఫిలిప్పీన్స్​ను వణికిస్తోన్న 'వామ్కో'- 53కు చేరిన మృతులు
author img

By

Published : Nov 14, 2020, 5:29 PM IST

ఫిలిప్పీన్స్​లో 'వామ్కో' తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఈ విధ్వంసానికి ఇప్పటివరకు 53 మంది ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. తుపాను ధాటికి పలుచోట్ల కొండచరియలు విరిగిపడగా.. సుమారు 22మంది గల్లంతయ్యారని వెల్లడించింది. వారిని వెలికితీసేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

ఫిలిప్పీన్స్​ను వణికిస్తోన్న 'వామ్కో'- 53కు చేరిన మృతులు

కాగాయన్​, ఇసాబెలా రాష్ట్రాల్లో బాధితులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు సిబ్బంది. అక్కడి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వాయుసేన రంగంలోకి దిగి.. రక్షణ చర్యలు చేపట్టింది.

దేశంలో ఆర్థిక కార్యకలాపాలకు నిలయమైన లుజోన్​పై తుపాను ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఫిలిప్పీన్స్ మొత్తం జనాభా 11 కోట్లు కాగా.. సగం మంది ఈ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. దాదాపు 70 శాతం ఆర్థిక కార్యకలాపాలు ఇక్కడి నుంచే జరుగుతాయి.

ఇదీ చదవండి: 'దీపావళి వేళ చీకటి నుంచి వెలుగుల్లోకి..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.