Philippines typhoon death: ఫిలిప్పీన్స్‌ను అతలాకుతలం చేసిన భీకర తుపాను 'రాయ్' ధాటికి మరణించిన వారి సంఖ్య 208కి చేరింది. ఒక్క బోహోల్ రాష్ట్రంలోనే 100కి పైగా మరణాలు నమోదయ్యాయని సమాచారం. దేశవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మందిపై తుపాను ప్రభావం పడింది.

తుపాను బీభత్సంతో ఫిలిప్పీన్స్ కోలుకోలేని స్థితికి చేరింది. రెండే రోజుల్లో యావత్ దేశాన్ని అతలాకుతలం చేసింది. వేలాది ఇళ్లు, భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. భారీ వర్షాలు, వరదలతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. చెట్లు, ఇళ్ల పైకప్పులపై ప్రజలు బిక్కుబిక్కుమంటూ తలదాచుకున్న దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి.

ఇదీ చదవండి: ఫిలిప్పీన్స్‌లో 'రాయ్' బీభత్సం- 112కు చేరిన మృతులు