ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే.. కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షలు చేయించుకోనున్నారు.
ఇందుకే..
ఇటీవల ఫిలిప్పీన్స్లో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల కార్యక్రమాలకు హాజరైన కొందరికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యింది. దీంతో.. అప్రమత్తమైన అధికారులు.. ఆ కార్యక్రమం జరిగిన సెనేట్ భవనం సహా ఫిలిప్పీన్స్ సెంట్రల్ బ్యాంక్ భవనాల్లో శుభ్రతా కార్యక్రమాలు చేపట్టారు. అనేక మంది అధికారులు స్వచ్ఛందా నిర్బంధంలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు.
ప్రభుత్వ అధికారులు, సెనేటర్లను నిత్యం కలిసే అధ్యక్షుడు డ్యూటెర్టే సైతం ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ముందుకువచ్చారు. వృద్ధుల్లో వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. 74 ఏళ్ల డ్యూటెర్టే పరీక్షలు చేయించుకోవడం అత్యవసరమని భావిస్తున్నారు.
ఫిలిప్పీన్స్లో ఇప్పటివరకు 49 మందికి కరోనా సోకింది. వైరస్ బారినపడి ఇద్దరు మృతి చెందారు.
ఇదీ చదవండి:కమల్నాథ్ సర్కార్ భవితవ్యం తేలేది ఆరోజే...