ETV Bharat / international

ఫిలిప్పీన్స్​లో హెలికాప్టర్​ కూలి నలుగురు మృతి - Philippines updates

ఫిలిప్పీన్స్​లో ఓ హెలికాప్టర్​ కూలి నలుగురు మరణించారు. జాంబోవంగా నుంచి బయల్దేరిన సికోర్క్సీ విమానం బేసిలాన్​ ద్వీపంలో కుప్పకూలిందని అధికారులు తెలిపారు.

Philippine air force helicopter crashes, 4 crew killed
ఫిలిప్పీన్స్​లో హెలికాఫ్టర్​ కూలి నలుగురు మృతి
author img

By

Published : Sep 16, 2020, 7:04 PM IST

ఫిలిప్పీన్స్​లో వైమానిక దళ హెలికాప్టర్ కుప్పకూలింది. బేసిలాన్​ ద్వీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు సిబ్బంది మృతి చెందారు. ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడిలో గాయపడ్డ వారిని తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

దక్షిణ జాంబోవంగా నుంచి సులూ రాష్ట్రానికి బయల్దేరిన సికోర్స్కీ ఎస్​-76ఏ విమానం.. వర్షం కారణంగా తలెత్తిన ఇబ్బందులతో కూలిందని వాయుసేన వెల్లడించింది. మృతుల్లో ఇద్దరు పైలట్లు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు.

ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేపట్టారు అధికారులు. భద్రతా చర్యల్లో భాగంగా.. ఇతర సికోర్క్సీ హెలికాప్టర్లను తనిఖీ చేస్తున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి: జపాన్ ప్రధానిగా యొషిహిదె అధికారిక ఎన్నిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.