ETV Bharat / international

పెంపుడు కుక్కకు కరోనా వైరస్​.. ఎక్కడంటే? - Coronavirus in Hong Kong

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ జంతువులకు కూడా సోకుతోంది. హాం​కాంగ్​లో ఓ పెంపుడు కుక్కకు వైరస్​ లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. ఇలాంటి కేసు ఇక్కడ ఇదే మొదటిది అని చెబుతున్నారు.

Pet dog quarantined in Hong Kong with low levels of coronavirus
పెంపుడు కుక్కకు కరోనా వైరస్​.. ఎక్కడంటే?
author img

By

Published : Feb 28, 2020, 6:45 PM IST

Updated : Mar 2, 2020, 9:25 PM IST

హాం​కాంగ్​లో ఓ పెంపుడు కుక్కకు కరోనా వైరస్​ లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. వైరస్​తో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ 60ఏళ్ల వృద్ధురాలి కుక్కకు వైద్యుల కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆ శునకానికి కూడా వైరస్​ లక్షణాలు ఉన్నట్లు తేలింది. అయితే ఆ దేశ వ్యవసాయ, మత్స్యసంపద పరిరక్షణ విభాగం ఈ విషయాన్ని తోసిపుచ్చింది.

వైరస్​ సోకిన కుక్కను జంతు కేంద్రంలో ఉంచి పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జంతువులకు కరోనా వైరస్ సోకడం దేశంలో ఇదే మొదటి సారని వెల్లడించారు.

అయినప్పటకీ...

కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులకు వైరస్ సోకినట్లు గానీ, జంతువుల నుంచి మానవులకు వ్యాపించినట్లు గానీ ఎటువంటి ఆధారాలు లేవని హాంకాంగ్​ వ్యవసాయ, మత్స్య సంపద పరిరక్షణ విభాగం తెలిపింది. అయితే వైరస్​ సోకిన వారి పెంపుడు జంతువులను 14 రోజులు పరిశీలనలో ఉంచాలని సూచించింది.

ఏ దేశంలో ఎంతమంది?

కరోనా వైరస్​ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 83వేల మందికి పైగా సోకగా.. 2,800 మంది మృతి చెందారు. చైనాలోనే 2,788 మంది ప్రాణాలు కోల్పోగా... 78,824మంది ఈ వైరస్​ బారిన పడ్డారు.

దేశం కేసులు మరణాలు
హాంకాంగ్​ 92 2
మకావూ10 -
దక్షిణ కొరియా2,02213
జపాన్918 8
ఇటలీ65015
ఇరాన్25434
సింగపూర్96-
అమెరికా60-
కువైట్43-
థాయ్​లాండ్​ 40-
బహ్రెయిన్33-
తైవాన్321
ఆస్ట్రేలియా23-
మలేషియా23-
జర్మనీ21-
ఫ్రాన్స్382
స్పెయిన్17-
వియత్నాం16-
బ్రిటన్15-
యూఏఈ19-
కెనడా14-
ఇరాక్6-
రష్యా5-
స్విట్జర్లాండ్5-
ఒమన్6-
ఫిలిప్పీన్స్31
భారత్3-
క్రొయేషియా3-
గ్రీస్3-
ఇజ్రాయెల్3-
లెబనాన్3-
పాకిస్థాన్2-
ఫిన్​లాండ్2-
ఆస్ట్రియా2-
స్వీడన్7-
ఈజిప్ట్1-
అల్జేరియా1-
అఫ్గానిస్థాన్1-
ఉత్తర మాసిడోనియా1-
జార్జీయా1-
ఎస్టోనియా1-
బెల్జియం1-
నెదర్లాండ్స్1-
రోమన్1-
నేపాల్1-
శ్రీలంక1-
కాంబియా1-
నార్వే1-
డెన్మార్క్1-
బ్రెజిల్1-

ఇదీ చూడండి: ఉప్పుతో గుండెకు ముప్పు- తగ్గించకపోతే అంతే!

Last Updated : Mar 2, 2020, 9:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.