"మన ప్రజలకు మోదీ తెలిపిన శుభాకాంక్షల్ని స్వాగతిస్తున్నా. అతి ముఖ్యమైన కశ్మీర్ అంశం సహా వివిధ సమస్యలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరగాలని కోరుకుంటున్నా. రెండు దేశాల ప్రజల శాంతి కోసం నూతన బంధాలను ఏర్పరచుకోవాలని ఆకాంక్షిస్తున్నా."-ఇమ్రాన్‌ఖాన్, ట్విట్టర్
పాక్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉగ్రవాద వ్యతిరేక దక్షిణాసియా నిర్మాణమే లక్ష్యంగా పనిచేయాలని కోరుతూ ఇమ్రాన్‌ఖాన్‌కు లేఖ రాశారు మోదీ. పుల్వామా దాడి అనంతరం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పాక్ ప్రధానికి మోదీ లేఖ రాయడం విశేషం. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు, శాంతియుత దక్షిణాసియాను తయారుచేసేందుకు కలిసి నడవాలన్నారు మోదీ.
పాక్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ దేశ హైకమిషనర్ దిల్లీలో ఇచ్చే విందుకు భారత్ గైర్హాజరైంది. జమ్ముకశ్మీర్ నుంచి వేర్పాటువాద నేతల్ని ఈ విందుకు ఆహ్వానించడమే కారణంగా పేర్కొంది.