పాక్‌లోని జల సంబంధిత నిపుణులు వచ్చేవారం భారత్‌కు రానున్నట్లు ఆ దేశం తెలిపింది. మార్చి 23, 24న దేశ రాజధానిలో జరగబోయే 116వ శాశ్వత సింధు నదీ కమిషన్ సమావేశంలో వారి నిపుణుల బృందం పాల్గొనున్నట్లు పాక్ విదేశాంగ ప్రతినిధి జహీద్ హఫీజ్ చౌదరీ తెలిపారు. సింధు జలాల ఒప్పందంపై ఇరు దేశాల నిపుణుల బృందం చర్చించనున్నట్లు వివరించారు. భారత్ తరపున సింధు నదీ జలాల కమిషనర్ పీకే సక్సేనా ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
జమ్ముకశ్మీర్‌లో అధికరణ 370 రద్దు చేసిన తర్వాత తొలిసారి జరగనున్న ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి : 'భారతీయ విద్యార్థులకు చైనా టీకా'పై పరిశీలిస్తాం'