ETV Bharat / international

'జాదవ్‌కు న్యాయవాదిని నియమించుకోండి' - కులభూషన్​ యాదవ్​ కేసు

మాజీ నావికాదళ అధికారి కులభూషణ్‌ జాదవ్‌ తరపున న్యాయవాదిని నియమించుకోవాలని భారత్​ను పాకిస్థాన్​ కోరింది. పాక్‌ చెరలోని జాదవ్​పై ఉన్న​ కేసులో ఇస్లామాబాద్‌ హైకోర్టు పునఃవిచారణ జరుపుతోంది.

pakisthan
పాకిస్థాన్
author img

By

Published : Apr 17, 2021, 7:14 AM IST

పాక్‌ చెరలో ఉన్న భారత మాజీ నావికాదళ అధికారి కులభూషణ్‌ జాదవ్‌ తరపున న్యాయవాదిని నియమించుకోవాలంటూ దాయాది దేశం మరోసారి భారత్‌ను కోరింది. గూఢచర్యం ఆరోపణలతో జాదవ్‌కు పాక్‌ కోర్టు మరణశిక్ష విధించగా.. అంతర్జాతీయ న్యాయస్థానం ఆ శిక్షను నిలిపేసింది. దీంతో ఇస్లామాబాద్‌ హైకోర్టు ఈ కేసును పునఃవిచారణ జరుపుతోంది.

జాదవ్‌ తరపున న్యాయవాదిని నియమించేలా భారత్‌ను సంప్రదించాలని హైకోర్టు పాక్‌ సర్కారుకు సూచించింది. ఈమేరకు భారత్‌కు వర్తమానం పంపినట్టు అక్కడి విదేశాంగ కార్యాలయం పేర్కొంది.

ఇదీ చదవండి: సీజేఐ జస్టిస్‌ బోబ్డేకి అశ్వినీకుమార్‌ లేఖ

ఇదీ చదవండి:'సీజేఐ పదవిలో మహిళ.. ఆ రోజు దగ్గర్లోనే ఉంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.