ETV Bharat / international

పాకిస్థాన్​ టెక్స్​టైల్స్ పరిశ్రమకు తీవ్ర నిరాశ

భవిష్యత్తులో.. పాకిస్థాన్​ టెక్స్​టైల్స్ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోనున్నట్టు తెలుస్తోంది. భారత్​ నుంచి నూలు, దారం దిగుమతులు చేసుకోవాలన్న ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదనల్ని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ తిరస్కరించడమే ఇందుకు కారణం.

Pakistan's textile industry
పాకిస్థాన్​ టెక్స్​టైల్స్ పరిశ్రమకు తీవ్ర నిరాశ
author img

By

Published : Apr 3, 2021, 7:52 AM IST

పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ నిర్ణయం కారణంగా ఆ దేశ టెక్స్​టైల్స్​ పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కోనుంది. భారత్​ నుంచి నూలు, దారం దిగుమతులు చేసుకోవాలన్న ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదనలను ఆయన గురువారం తిరస్కరించారు. జమ్ముకశ్మీర్​కు మళ్లీ స్వయం ప్రతిపత్తి వచ్చేంతవరకూ భారత్​తో సాధారణ సంబంధాలు వద్దని తమ ప్రధాని స్పష్టం చేశారని ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి తెలిపారు.

అయితే.. ప్రభుత్వ నిర్ణయం పట్ల పాకిస్థాన్​ అపారల్​ ఫోరమ్​ ఛైర్మన్​ జావెద్​ బిల్వానీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు 'ది డాన్​' పత్రిక పేర్కొంది. కరోనా మహమ్మారి కారణంగా.. పాకిస్థాన్​ టెక్స్​టైల్​ పరిశ్రమ ఇప్పటికే తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో పన్ను రహితంగా భారత్​ సహా.. పలు దేశాల నూలు, పత్తి, దారాన్ని దిగుమతి చేసుకునేందుకు అనుమతించాలని ఆయా వర్గాలు కోరుతున్నాయి.

ఈ విషయంలో ఇమ్రాన్​ ప్రభుత్వ వైఖరిపై స్పందించేందుకు భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందమ్​ నిరాకరించారు.

ఇదీ చదవండి: నేపాల్​ పాఠశాలల కోసం భారత్​ భారీ సాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.