ETV Bharat / international

'కూల్చిన హిందూ దేవాలయాన్ని పునర్నిర్మించండి' - హిందూ దేవాలయం కూల్చి వేతపై పాక్​ సుప్రీం కోర్టు

పాకిస్థాన్​లో కూల్చిన హిందూ దేవాలయాన్ని పునర్నిర్మించాలని ఎవాక్యూ ప్రాపర్టీ ట్రస్ట్ బోర్డు(ఈపీటీబీ)ను ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఘటన అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్థాన్​కు తలొంపులు తెచ్చిందని పేర్కొంది.

Pakistan's Supreme Court orders reconstruction of vandalised Hindu temple
'కూల్చిన హిందూ దేవాలయాన్ని పునర్నిర్మించండి'
author img

By

Published : Jan 5, 2021, 9:20 PM IST

పాకిస్థాన్​ ఖైబర్​ పఖ్తున్ఖ్వా రాష్ట్రం కరాక్​ జిల్లాలో హిందూ ఆలయాన్ని కూల్చిన ఘటనపై పాక్ సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేవాలయాన్ని పునర్నిర్మించాలని ఎవాక్యూ ప్రాపర్టీ ట్రస్ట్ బోర్డు(ఈపీటీబీ)ను ఆదేశించింది.

"పాకిస్థాన్​లో ఉన్న అన్ని దేవాలయాలు, గురుద్వారాల వివరాలను అందించాలి. దేశవ్యాప్తంగా దేవాలయ స్థలాలను ఆక్రమించుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ మనస్తత్వంతో ఈపీటీబీ ఛైర్మన్..ఆ పదవిలో కూర్చోవటం తగదు"

--పాక్​​ సుప్రీం కోర్టు ధర్మాసనం

ఆలయం కూల్చవేత ఘటన సమయంలో ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న 92 మంది పోలీస్ అధికారులను సస్పెండ్​ చేసిన విషయంపై సుప్రీం స్పందించింది. వారికి సస్పెన్షన్​ సరిపోదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ అహ్మద్​ అభిప్రాయపడ్డారు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.

ఇదీ చదవండి : పాక్​లో గుడి కూల్చివేతపై భారత్ నిరసన

పాక్​లో గుడి కూల్చివేత కేసులో 100 మంది అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.