ETV Bharat / international

'కౌన్​ బనేగా కరోడ్​పతి' పేరుతో పాక్​ కుట్రలు​

"కౌన్​ బనేగా కరోడ్​పతి షోలో మీరూ పాల్గొనండి..." అంటూ ఓ సందేశం వస్తే మీరేం చేస్తారు? చాలా మంది నిజమే అనుకుంటారు. ఆ మెసేజ్​లో ఉన్న విషయాన్ని నమ్మేస్తారు. కానీ... జరభద్రం! బిగ్​బీని కలవాలన్న కల, కోటీశ్వరులు కావాలన్న ఆశను ఆసరాగా చేసుకుని సరికొత్త కుట్రలు పన్నుతున్నాయి పాకిస్థానీ దుష్టశక్తులు. కేబీసీని అడ్డుపెట్టుకుని భారత్​పై నిఘా, అసత్య సమాచారం వ్యాప్తికి ప్రయత్నిస్తున్నాయి.

'కౌన్​ బనేగా కరోడ్​పతి' పేరుతో పాక్​ కుట్రలు​
author img

By

Published : Sep 22, 2019, 6:04 PM IST

Updated : Oct 1, 2019, 2:44 PM IST

"భారత్​ గురించి దుష్ప్రచారం చేయడం... లేదా రహస్య సమాచారం సేకరించడం"... కొంతకాలంగా పాకిస్థాన్​కు ఇదే పని. ఇందుకు అంతర్జాలాన్నే ప్రధాన వేదికగా చేసుకుంది. సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు, వాట్సాప్​లో గ్రూపులతో భారత్​పై విషం చిమ్మే పని సాగిస్తోంది.

ఆర్టికల్​ 370 రద్దు నేపథ్యంలో అసత్య సమాచారం వ్యాప్తికి పాకిస్థాన్​ మరిన్ని అడ్డదారులు తొక్కుతున్నట్లు భద్రతా సంస్థలు తాజాగా గుర్తించాయి. అత్యంత ప్రజాదరణగల కౌన్​ బనేగా కరోడ్​పతి(కేబీసీ) వంటి టీవీ షోల పేరిట సందేశాలు పంపి, ప్రజల్ని బుట్టలో పడేస్తున్నట్లు వెల్లడించాయి.
బిగ్​బీ అమితాబ్​ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కేబీసీ పేరిట మోసపూరితంగా ప్రజల్ని వాట్సాప్ గ్రూపుల్లో చేర్చి, అసత్య ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు వివరించాయి భద్రతా సంస్థలు. అలాంటి రెండు గ్రూపులకు పాకిస్థానీ నంబర్లు కలిగిన వ్యక్తులు అడ్మిన్​లుగా ఉండడాన్ని గుర్తించినట్లు తెలిపాయి. ప్రజలు తక్షణమే అలాంటి గ్రూపుల నుంచి బయటకు రావాలని భద్రతా సంస్థలు సూచించాయి.

సైనిక అధికారుల పేరిట...

భారత సైన్యంలో పనిచేస్తున్న, పదవీ విరమణ పొందిన 200 మంది అధికారుల పేరిట పాకిస్థానీ శక్తులు సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు తెరిచినట్లు భద్రతా సంస్థలు గుర్తించాయి. ఆయా ఖాతాల ద్వారా కశ్మీర్​కు సంబంధించిన తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నట్లు తేల్చాయి. ట్విట్టర్​కు ఫిర్యాదు చేసి ఇప్పటికే అనేక నకిలీ ఖాతాలను తొలిగించేలా చేశాయి.

ఇదీ చూడండి:- కశ్మీర్​లో ఉగ్ర దుశ్చర్యలకు పాక్​ విశ్వప్రయత్నాలు

Kathmandu (Nepal), Sep 22 (ANI): Consulate General of India celebrated the 150th year of birth of Mahatma Gandhi with a Khadi Fashion Show in Birgunj town of Nepal. The event was held at Hotel Vishwa for the first time. Around 13 students from different schools participated in the event and the winners of the show were presented with awards. India and all the Gandhi-followers worldwide celebrate Bapu's birth anniversary on 2nd October, which is also known as Gandhi Jayanti. Born in 1869, in Gujarat's Porbandar, Mahatma Gandhi had his early political training in South Africa while working among the local Indian community facing discrimination and oppression.
Last Updated : Oct 1, 2019, 2:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.