ETV Bharat / international

'గ్రే లిస్ట్'​లోనే పాక్​-ఉగ్రనిధులపై నియంత్రణ కొరవడటమే కారణం​! - ఎఫ్​ఏటీఎఫ్

పాకిస్థాన్​ను అనుమానాస్పద జాబితా(గ్రే లిస్ట్)​లోనే కొనసాగించాలని ఎఫ్​ఏటీఎఫ్​కు చెందిన అంతర్జాతీయ సహకార సమీక్ష బృందం ప్రతిపాదించింది. దీనిపై ఫిబ్రవరి 21న ఎఫ్​ఏటీఎఫ్​ తుది నిర్ణయం తీసుకోనుంది.

FATF's grey list
ఇమ్రాన్ ఖాన్
author img

By

Published : Feb 18, 2020, 8:49 PM IST

Updated : Mar 1, 2020, 6:42 PM IST

దాయాది పాక్​పై అంతర్జాతీయ ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ (ఎఫ్​ఏటీఎఫ్)కత్తి వేలాడుతోంది. ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధులు సమకూర్చడాన్ని అరికట్టడంలో విఫలమైనందుకు పాకిస్థాన్​ను గ్రే లిస్ట్​లోనే కొనసాగించాలని పారిస్​ వేదికగా జరుగుతున్న సమావేశాల్లో ఎఫ్​ఏటీఎఫ్​కు చెందిన అంతర్జాతీయ సహకార సమీక్ష విభాగం (ఐసీఆర్​జీ)ప్రతిపాదించింది. ఈ అంశమై ఫిబ్రవరి 21న తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

"పాకిస్థాన్​ను గ్రే లిస్ట్​లోనే ఉంచాలని ఐసీఆర్​జీ సమావేశంలో తీర్మానించారు. పాక్​ వ్యవహారాలపై చర్చించి ఎఫ్​ఏటీఎఫ్​ దీనిపై శుక్రవారం తుదినిర్ణయం తీసుకుంటుంది."

-అధికార వర్గాలు

పారిస్​లో ఎఫ్​ఏటీఎఫ్ సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో భాగంగా పాక్​ ప్రదర్శనను అంచనా వేసింది ఐసీఆర్​జీ. ఉగ్రవాదులకు నిధులు అందజేసే విషయంలో చట్టాలను మరింత కట్టుదిట్టం చేయాలని ఆ దేశానికి హితవు పలికింది.

పాక్​ను గ్రే లిస్ట్​లోనే ఉంచాలా లేదా అన్న విషయంపై నిర్ణయం తీసుకునే ప్లీనరీ సమావేశాలు బుధవారం(ఫిబ్రవరి 19) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే గ్రే లిస్ట్​లో ఉన్న పాకిస్థాన్ బ్లాక్​ లిస్ట్​లో పడకుండా జాగ్రత్త పడుతోంది.

బ్లాక్​ లిస్ట్ అసాధ్యం!

అయితే బ్లాక్​లిస్ట్​లో పాక్ చేరడం దాదాపు అసాధ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గ్రే లిస్ట్​లో నుంచి బయటపడేందుకు ఎఫ్​ఏటీఎఫ్​ సభ్యదేశాల 39 ఓట్లలో 12 ఓట్లు అవసరం అవుతాయి. 12 దేశాల మద్దతు ఉంటే గ్రే లిస్ట్​లో నుంచి బయటపడి వైట్​ లిస్ట్​లోకి వెళ్లే అవకాశం లభిస్తుంది. బ్లాక్ లిస్ట్​లో పడకుండా ఉండాలంటే కనీసం మూడు దేశాల మద్దతు తప్పనిసరి.

గత నెలలో జరిగిన ఎఫ్​ఏటీఎఫ్ సమావేశంలో చైనా, మలేసియా, టర్కీలు పాకిస్థాన్​కు మద్దతు పలికాయి. ఈ నేపథ్యంలో బ్లాక్ లిస్ట్​లో పాక్ చేరడం కష్టతరమని స్పష్టమవుతోంది.

ఎప్పటినుంచో..

ఇదివరకు 2008, 2012-15 మధ్యకాలంలోనూ పాక్‌ గ్రే జాబితాలో కొనసాగింది. ఆయా సందర్భాల్లో ఆర్థికంగా కుదేలైపోయింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. 2018లో మరోమారు ఈ జాబితాలో చేరింది దాయాది.

నిషేధిత జాబితా(బ్లాక్‌ లిస్ట్‌)లో ప్రవేశిస్తే పాకిస్థాన్‌కు విదేశీ పెట్టుబడులు రావడం గగనంగా మారుతుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్‌) సంస్థ నుంచి వచ్చే రుణాలూ ఆగిపోయే ప్రమాదం ఉంది.

Last Updated : Mar 1, 2020, 6:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.