ETV Bharat / international

నవంబర్​ 9న కర్తార్​పుర్​ నడవా ప్రారంభం... కానీ... - Pakistan to open Kartarpur Corridor on November

కర్తార్​పుర్ నడవాను నవంబర్ ​9న ప్రారంభిస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ ప్రకటించారు. అయితే యాత్రికుల నుంచి సేవా రుసుము కింద 20 డాలర్లు వసూలు చేయాలని పాక్ పట్టుబడుతుండడం వల్ల ఆన్​లైన్ రిజిస్ట్రేషన్లు ఇంకా ప్రారంభం కాలేదు.

నవంబర్​ 9న కర్తార్​పుర్​ నడవా ప్రారంభం: ఇమ్రాన్​ఖాన్​
author img

By

Published : Oct 20, 2019, 6:12 PM IST

Updated : Oct 20, 2019, 7:47 PM IST

నవంబర్​ 9న కర్తార్​పుర్​ నడవా ప్రారంభం... కానీ...

దాయాది దేశాల మధ్య ఆధ్యాత్మిక వారధిగా చెబుతున్న కర్తార్​పుర్​ నడవా​ను నవంబర్​ 9న ప్రారంభిస్తామని పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ ప్రకటించారు. సిక్కు మత స్థాపకుడు గురునానక్ ​దేవ్ 550వ జయంతి (నవంబర్​ 12) నాటికి నడవాను తెరుస్తారా అన్న ప్రశ్నకు ఇమ్రాన్ ఇలా స్పందించారు.

"కర్తార్​పుర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు చివరిదశలో ఉన్నాయి. కనుక 2019 నవంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కుల కోసం కర్తార్​పుర్ నడవాను తెరిచేందుకు పాకిస్థాన్​ సిద్ధంగా ఉంది.

ప్రపంచంలోని అతిపెద్ద గురుద్వారాను భారత్, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు సందర్శిస్తారు. ఇది సిక్కులకు ప్రధాన మత కేంద్రంగా మారుతుంది. స్థానిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తుంది. ప్రయాణ, ఆతిథ్య రంగాల వల్ల దేశానికి విదేశీ మారకద్రవ్యం చేకూరుతుంది."
- ఇమ్రాన్​ఖాన్​, పాక్ ప్రధాన మంత్రి

మన్మోహన్​ సింగ్ వెళ్తారు కానీ...

కర్తార్​పుర్​ నడవా ప్రారంభోత్సవానికి భారత మాజీ ప్రధాని మన్మోహన్​సింగ్ హాజరుకారని తెలిసింది. అయితే... ఆయన ఓ సాధారణ భక్తుడిలా గురుద్వారా సందర్శనకు వెళ్తారని ఆయనకు సన్నిహితంగా ఉండే వర్గాలు తెలిపాయి. నడవా ప్రారంభోత్సవానికి రావాలని పాక్​ విదేశాంగ మంత్రి మహమూద్​ ఖురేషీ రాసిన లేఖకు మన్మోహన్ ఈమేరకు బదులిచ్చినట్లు వెల్లడించాయి.

పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నేతృత్వంలోని సిక్కుల బృందంలో మన్మోహన్​ ఉంటారని తెలిసింది. ఆ బృందం కర్తార్​పుర్​లో ప్రార్థనలు చేసి, అదే రోజు భారత్​కు తిరిగి​ వస్తుంది.

ఆరంభంకాని ఆన్​లైన్​ రిజిస్ట్రేషన్​

కర్తార్​పుర్​ యాత్రకు ఆన్​లైన్ నమోదు ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. యాత్రికుల నుంచి సేవారుసుము కింద 20 డాలర్లు వసూలు చేయాలని పాక్​ పట్టుబడుతుండడమే ఇందుకు కారణం. సేవా రుసుము వసూలు చేయకూడదన్నది భారత్​ వాదన. దీనితోపాటు మరికొన్ని విషయాల్లో రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సి ఉంది. ఫలితంగా ఆన్​లైన్​ నమోదు ప్రక్రియ వాయిదా పడింది.

చెరో సగం

ప్రతిపాదిత కారిడార్​ పాకిస్థాన్​ కర్తార్​పుర్​లోని దర్బార్​సాహిబ్​ను, పంజాబ్ గురుదాస్​పుర్​ జిల్లాలో గల బాబా నానక్​ మందిరంతో కలుపుతుంది. ఫలితంగా ప్రతిరోజూ సుమారు 5వేల మంది భారతీయ సిక్కు భక్తులు, యాత్రికులు వీసాలేకుండానే పాక్​లోని పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకునే అవకాశం కలుగుతుంది.

పాకిస్థాన్... భారత సరిహద్దు నుంచి కర్తార్​పుర్​లోని గురుద్వారా దర్బార్​ సాహిబ్​ వరకు నడవా నిర్మిస్తుండగా, ఇటువైపు పంజాబ్​లోని గురుదాస్​పుర్ జిల్లాలోని డేరాబాబా నానక్​ నుంచి సరిహద్దుల వరకు భారత్​ ఈ నడవాను నిర్మిస్తోంది.

ఇదీ చూడండి: ఒడిశాలో ఘోరం- ద్విచక్రవాహనంపై మృతదేహం తరలింపు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Netherlands and transnational broadcasters who broadcast into the Netherlands. Max use 2 minutes. Use within 72 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Stadion Galgenwaard, Utrecht, Netherlands. 19th October 2019.
FC Utrecht (white and red) 3-0 PSV Eindhoven (black and orange)
1. 00:00 Players walk onto the pitch and Utrecht fans pre-match
Second half:
2. 00:10 PSV's Steven Bergwijn has his curling shot from outside the box tipped around the post by Utrecht goalkeeper Maarten Paes in the 48th minute
3. 00:25 GOAL FOR UTRECHT - Sander van de Streek's shot deflects off Nick Viergever and past PSV goalkeeper Jeroen Zoet in the 49th minute, 1-0
4. 00:47 Replay of Sander van de Streek's deflected goal
5. 00:57 RED CARD FOR PSV - Nick Viergever is sent off for a dangerous challenge on Utrecht's Bart Ramselaar after referee Danny Makkelie, who initially gave a yellow card, reviewed the incident in the 67th minute
6. 01:05 Replay of Nick Viergever's challenge
7. 01:10 Referee Danny Makkelie reviews the incident and issues a red card
8. 01:17 RED CARD FOR PSV - Jorrit Hendrix is sent off for a dangerous challenge on after referee Danny Makkelie, who initially gave a yellow card, reviewed the incident in the 73rd minute
9. 01:28 Referee Danny Makkelie reviewing the incident and replay of Jorrit Hendrix's challenge
10. 01:38 Referee Danny Makkelie sends Jorrit Hendrix off
11. 01:44 GOAL FOR UTRECHT - Adam Maher collects the ball from a Simon Gustafson pass and scores from long range in the 82nd minute, 2-0
12. 01:59 Replay of Adam Maher's goal
13. 02:07 GOAL FOR UTRECHT - Sean Klaiber is played through on goal by substitute Urby Emanuelson and he shoots the ball low through the legs of PSV goalkeeper Jeroen Zoet in the 93rd minute, 3-0
14. 02:24 Utrecht head coach John van den Brom celebrates victory
SOURCE: IMG Media
DURATION: 02:29
STORYLINE:
Nine-man PSV Eindhoven suffered their first defeat of the Dutch Eredivisie season with a heavy 3-0 loss to FC Utrecht at the Stadion Galgenwaard on Saturday - Ajax are now three points clear of PSV at the top of the table.
Last Updated : Oct 20, 2019, 7:47 PM IST

For All Latest Updates

TAGGED:

imrankhan
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.