ETV Bharat / international

భారత్​ నుంచి పోలియో మార్కర్ల దిగుమతికి పాక్​ నిర్ణయం! - పోలీయో మార్కర్

జమ్ముకశ్మీర్​ విభజన, అధికరణ 370 రద్దు అనంతరం భారత్​తో వాణిజ్య సంబంధాలను తెంచుకున్న పాకిస్థాన్​ కొన్ని నెలల్లోనే వెనక్కి తగ్గింది. భారత్​ నుంచి పోలియో మార్కర్లను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. మార్కర్ల దిగుమతికి వన్​-టైమ్​ అనుమతి ఇవ్వాలని ఆ దేశ ఫెడరల్​ కేబినేట్​ నిర్ణయించింది.

Pakistan to import polio markers from India
భారత్​ నుంచి పోలీయో మార్కర్ల దిగుమతికి పాక్​ నిర్ణయం!
author img

By

Published : Dec 26, 2019, 4:08 AM IST

Updated : Dec 26, 2019, 7:37 AM IST

భారత్​ నుంచి పోలియో మార్కర్ల దిగుమతికి పాక్​ నిర్ణయం!

భారత్​ నుంచి పోలియో మార్కర్లను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది పాకిస్థాన్​. ఈ మేరకు ఆ దేశ ఫెడరల్​ కేబినేట్​ వన్​-టైమ్​ అనుమతులు ఇచ్చినట్లు పాక్​కు చెందిన ఓ వార్తా సంస్థ వెల్లడించింది. జమ్ముకశ్మీర్​ విభజన, అధికరణ 370 రద్దు చేసిన కొన్ని నెలల్లోనే పాకిస్థాన్​ తన మొండి వైఖరి నుంచి వెనక్కి తగ్గింది. అన్ని రకాల వాణిజ్య సంబంధాలను తెంచుకున్న పాక్..​ ఔషధాల దిగుమతిలో ఆచితూచి అడుగులు వేస్తోంది.

" భారత్​ నుంచి పోలియో మార్కర్ల దిగుమతికి వన్​-టైమ్​ అనుమతి ఇవ్వాలని ఫెడరల్​ కేబినేట్​ నిర్ణయం తీసుకుంది. భారత్​ నుంచి మందుల దిగుమతిపై నిషేధం ఎత్తివేయాలని ఆ దేశ ఔషధ పరిశ్రమ డిమాండ్​ చేస్తోంది. లేకపోతే కొన్ని వారాలలో పాకిస్థాన్​ తీవ్ర మందుల కొరత, ముఖ్యంగా ప్రాణాలను రక్షించే ఔషధాల సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని హెచ్చరించింది. దాని పర్యవసానంగా భారత్​ నుంచి మందులు, ముడి పదార్థాల దిగుమతిపై నిషేధాన్ని గత సెప్టెంబర్​లో ఎత్తివేసింది పాక్​."
- పాక్ మీడియా సంస్థ

మార్కర్లు ఎందుకు?

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆమోదిత పోలియో వాక్సిన్​ను చిన్నారులకు అందించిన అనంతరం వారి వేలికి మార్కర్లతో గుర్తు పెడతారు. పోలియో చుక్కలు వేసే క్రమంలో పిల్లలు కొంత మేర ఇంకును మింగే అవకాశం ఉన్నందున విషపూరితం కాని మార్కర్ల దిగుమతి అవసరమని పాకిస్థాన్​ పోలియో అత్యవసర సేవల కేంద్రం జాతీయ కోఆర్డినేటర్​ డాక్టర్​ రాణా సఫ్దార్ తెలిపారు.

భారత్​, చైనాలోనే..

చిన్నారులు ఇంకును మింగినా.. విషపూరితంకాని మార్కర్లు తయారీ చేసే డబ్ల్యూహెచ్​ఓ ఆమోదిత సంస్థలు భారత్​, చైనాలో మాత్రమే ఉన్నాయి. పాక్​ కోసం డబ్ల్యూహెచ్​ఓ మార్కర్లను సేకరిస్తోంది. గతంలో చైనా నుంచి కొనుగోలు చేసినప్పటికీ.. నాణ్యత విషయంలో తేడా వచ్చి భారత్​ నుంచి తీసుకోవాలని నిర్ణయించింది. వాణిజ్యంపై పాక్​ నిషేధం విధించక ముందే భారత్​ నుంచి 8 లక్షల మార్కర్లు సేకరించాలని డబ్ల్యూహెచ్​ఓ నిర్ణయించింది. కానీ.. నిషేధం వల్ల పంపిణీ కాలేదు. ప్రస్తుతం నిషేధం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నందున పాక్​కు మార్కర్లు చేరనున్నాయి.

104 కేసుల గుర్తింపు..

పాకిస్థాన్​ సహా అఫ్గానిస్థాన్​, నైజీరియాలో పోలియో లక్షణాలు ఇంకా ఉన్నాయి. ఈ ఏడాది పాకిస్థాన్​లో 104 పోలియో కేసులు నమోదయ్యాయి. దేశంలోని 33 జిల్లాల్లో సుమారు 6.75 మిలియన్లకు పైగా చిన్నారులకు పోలియో వాక్సిన్​ పంపిణీ ఈనెలలోనే ప్రారంభించింది పాక్​. 1994 నుంచి పోలియోను నిర్మూలించేందుకు చర్యలు చేపట్టింది​.

ఇదీ చూడండి: మరోసారి పాక్​ దుర్నీతి.. భారత సైన్యాధికారి వీరమరణం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++MUTE AT SOURCE++
POOL - AP CLIENTS ONLY
Dover Air Force Base, Delaware - 25 December 2019
1. Mid of officials
2. Soldiers entering plane for Sgt. 1st Class Michael J. Goble's casket
3. Various of soldiers carrying casket
4. Zoom in of casket being placed onto a van
5. Pan right of officials at ceremony
6. Zoom in of officials, soldiers as van's doors are closed at end of ceremony
STORYLINE:
The remains of a 33-year-old American soldier killed in combat in Afghanistan have been returned to the United States, arriving at Dover Air Force Base in Delaware Wednesday.
Sgt. 1st Class Michael J. Goble of Washington Township, New Jersey, was killed Monday in a roadside bombing in northern Kunduz province. The Taliban claim they were behind the attack.
Goble was assigned to 1st Battalion, 7th Special Forces Group (Airborne), Eglin Air Force Base, Florida.
The Pentagon has said Goble's unit was engaged in combat operations in Kunduz Province, Afghanistan, when he suffered fatal injuries.
A number of senior U.S. officials, including National Security Adviser Robert O'Brien and Army Gen. Mark A. Milley, Chairman of the Joint Chiefs of Staff, attended what the military called a dignified transfer Wednesday, in which the cases containing the remains were transferred to a vehicle from the aircraft that ferried them to the United States.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 26, 2019, 7:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.