కశ్మీర్ సమస్యపై పాకిస్థాన్ మంగళవారం ఇండియన్ ఛార్జ్ డి ఎఫైర్స్‌ను పిలిపించి నిరసన తెలిపింది. 'కశ్మీర్ బ్లాక్ డే' సందర్భంగా బలమైన నిరసన నమోదు చేయడానికి భారత దౌత్యవేత్తను పిలిచినట్లు పాక్ విదేశాంగ కార్యాలయం తెలిపింది. ప్రత్యేక హోదాను ఉపసంహరించుకుని.. జమ్ము-కశ్మీర్, లద్దాఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించే ఏకపక్ష చర్యను భారత్ రద్దు చేసుకోవాలని ఈ సందర్భంగా పాక్ డిమాండ్ చేసింది.
గతేడాది ఆగస్టు 5న అధికరణం-370 రద్దుపై భారత్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతును కూడగట్టడంలో పాకిస్థాన్ విఫలమైంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను రద్దు చేయడం భారత అంతర్గత విషయమని అంతర్జాతీయ సమాజం పాక్‌కు స్పష్టం చేసింది.