ETV Bharat / international

పాక్​ ఆపరేషన్లలో 8మంది ఉగ్రవాదులు హతం! - తాలిబన్ కమాండర్లు

నాటి తాలిబన్​ ప్రాబల్య ప్రాంతమైన ఉత్తర వాజిరిస్తాన్​లో ఉగ్రవాద రహస్య స్థావరాలపై దాడులు చేసినట్లు పాకిస్థాన్ ప్రకటించింది. రెండు వేర్వేరు ఆపరేషన్లలో మొత్తం ఎనిమిది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు తెలిపింది.

Pakistan security forces say 8 militants killed in raids
8 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన పాక్​ సైన్యం
author img

By

Published : Mar 7, 2021, 11:33 AM IST

రెండు ఆపరేషన్లలో.. 8మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు పాకిస్థాన్​ ప్రకటించింది. ఒకప్పుడు.. తాలిబన్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఉత్తర వాజిరిస్తాన్​ ప్రాంతంలోని మిలిటెంట్ల స్థావరాలపై ఈ నిఘా ఆధారిత ఆపరేషన్లు​ నిర్వహించినట్టు పేర్కొంది.

బోయా, దొశాలి ప్రాంతాల్లో ఆపరేషన్లు జరిగాయని.. ఇందులో ముగ్గురు పాకిస్థానీ తాలిబన్​ కమాండర్లను మట్టుబెట్టినట్లు సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. వీరు గతంలో భద్రతా దళాలు, పౌరులపై ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు తెలిపింది.

ఆయా ప్రాంతాల్లో ఉగ్రవాదులు తిరిగి తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నారన్న అనుమానాల నేపథ్యంలో.. ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది పాక్​ సైన్యం.

2015 వరకు..(పాక్​ మిలటరీ ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే ముందు) ఉత్తర, దక్షిణ వాజిరిస్తాన్​ ప్రాంతాలు ఉగ్రవాదులకు ప్రధాన స్థావరాలుగా ఉండేవి. భద్రతా బలగాలపై తరచూ ఉగ్రవాదులు దాడులు చేసేవారు.

ఇదీ చదవండి: ఆ 8 మందిని అప్పగించండి: మయన్మార్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.